గుడ్ బై చెప్పాను, నా జీవితంలో ఇక నటన అనే అంశమే లేదు: ఇక ఆ అందాలని తెరమీద చూడలేమా

నటించిన కొద్ది చిత్రాలకే చక్కని గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

Recommended Video

నటనకు "గుడ్ బై" చెప్పిన ప్రభాస్ హీరోయిన్..

లీడర్‌, మిరపకారు, మిర్చి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రిచా గంగో పాధ్యా రు గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి తన స్టడీస్‌ లో బిజీగా ఉంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బెంగాలీ బ్యూటీ తన అందం తోనూ, నటన తోనూ బాగానే ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ధనుష్, శింబు వంటి స్టార్ హీరోల సరసన కూడా ఈ భామ నటించింది. కెరియర్ మంచి ఫేమ్ లో ఉన్నప్పుడు సడెన్ గా ఈమె అమెరికా కు వెళ్ళిపోయింది..

 దూరం అయ్యింది

దూరం అయ్యింది

సినిమాలకైతే దూరం అయ్యింది కానీ అభిమానులకు మాత్రం తన పేస్ బుక్, ట్వటర్ పేజీ లో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ దగ్గరవుతుంది.. అసలు సినిమాలని నేను ప్రొఫెషన్ గా తీసుకోలేదని క్యాజువల్ గా ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యానని.. సినిమా అంటే సీరియస్ గా తీసుకోలేదు కాబట్టే హీరోయిన్ గా ఆఫర్స్ వున్నా చేయకుండా అమెరికా వచ్చేసానని చెప్పిన రిచా ఇప్పుడు ఒక షాక్ ఇచ్చింది.

 ఇక నటించబోనని ట్వీట్

ఇక నటించబోనని ట్వీట్

నటించిన కొద్ది చిత్రాలకే చక్కని గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రానున్న రోజుల్లో ఇక నటించబోనని ట్వీట్ చేసింది. 2013లో చివరిసారిగా నాగ్ సరసన భాయ్ సినిమాలో నటించిన రిచా ఆ తర్వాత తాను మళ్లీ అమెరికా వెళ్లి ఎంబీఏ చేయదల్చుకున్నానని, ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని అప్పట్లోనే స్పష్టంచేసింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?

నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?

అయితే కొన్నాళ్ళకి మళ్ళీ నటించాల్సి వస్తే మొదటి ఫ్రిఫరెన్స్ టాలీవుడ్ కే అని అనటం తో ఇక మళ్ళీ వచ్చేస్తుందేమో అనుకున్నారంతా.. ఇటీవల ట్విట్టర్ ద్వారా రిచా తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు స్వయంగా చెప్పింది. ఆమె ఫాలోవర్లు కొందరు.. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..? మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారు? అంటూ హీరోయిన్ రిచాకు తెగ ట్వీట్లు చేస్తున్నారట.

 నా జీవితంలో వేరే దశలో ఉన్నాను

నా జీవితంలో వేరే దశలో ఉన్నాను

దీంతో తన అభిమానులు, ట్విట్టర్ ఫాలోయర్లకు ఆమె వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చింది. 'నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. కానీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చివరి మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. నా వివరాలు గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో వేరే దశలో ఉన్నాను. ఇందులో నటన అనే అంశమే లేదంటూ' సినిమాలకు గుడ్ బై చెప్పేశానని నటి రిచా గంగోపాధ్యాయ్ వరుస ట్వీట్లతో చెప్పేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X