నేను చనిపోలేదు, క్షేమంగా ఉన్నాను: ప్రముఖ సింగర్ పి. సుశీల
ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు, ఫేమస్ సెలబ్రిటీల మీద చనిపోయినట్లు రూమర్స్ రావడం తరచూ వింటూనే ఉన్నాయి. తాజాగా ఈ డెత్ హాక్స్ రూమర్స్ ప్రముఖ సింగర్ పి.సుశీల మీద ప్రచారంలోకి వచ్చాయి.
సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వైరల్ కావడంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు. కొందరు కండోలెన్స్ తెలుపుతూ మెసేజ్‌లు పోస్టు చేశారు. అయితే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయింది. తాను క్షేమంగా ఉన్నాను అని తెలియజేస్తూ సుశీల తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె యూఎస్ఏలో క్షేమంగా ఉన్నారు.
వివిధ భాషల్లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా పి. సుశీల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 2016లో మార్చిలో స్థానం సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల్లో ఆమె పాటలు పాడారు.


Click it and Unblock the Notifications











