నేను వాళ్శకంటే వేశ్య పాత్ర బాగానే చేస్తానంటున్న స్టార్ హీరోయిన్..
వేశ్య పాత్ర పోషించినప్పుడు ఒక హీరోయిన్‌కు లభించే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. అందుకే.. హిందీలో టబు, కరీనాకపూర్ వంటి హీరోయిన్లు, తెలుగులో అనుష్క ఏరికోరి వేశ్యపాత్రలు పోషించారు. కొంచెం వెనక్కి వెళితే మహానటి సావిత్రి, సహజనటి జయసుధ సైతం ఈ తరహా పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా ఒక చిత్రంలో వ్యభిచారిణి పాత్ర పోషిస్తోంది. హృతిక్‌రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అమితాబ్ నటించిన 'అగ్నిపధ్" చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. అమితాబ్ పోషించిన పాత్రను హృతిక్‌రోషన్ పోషిస్తుండగా, రేఖ పోషించిన పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తోంది. అయితే రేఖ పోషించిన నర్స్ పాత్రను వ్యభిచారిణిగా మార్చడం విశేషం..


Click it and Unblock the Notifications











