వాడంటే నాకు ప్రాణం,అందుకే అలా చేశాను..!
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ నటించిన 'ఖలేజా'త్వరలో ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇటీవల ట్వట్టర్ లో మహేష్ తన అభిమానులను తన కొడుకు 'గౌతమ్'ఆడుకొవడం కొసం ఆన్ లైన్ గేమ్స్ కావాలని మంచి సైట్స్ చెప్పాలని అభిమానులను సలహా అడగగా, వారు కొన్ని సైట్స్ ని చెప్పగా మహేష్ ఆన్ లైన్ గేమ్స్ డౌన్ లోడ్ చేశారట. ఈ విషయంలో మహేష్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.
తర్వాత మహేష్ తన కొడుకు గౌతమ్ తో పాటు,తను కూడా గేమ్స్ ఆడుతున్నానని,చాలా సరదాగా వున్నాయని తన ట్వట్టర్ లో ట్వీట్ చేశారు. మహేష్ ఖాళీ సమయంలో తన కొడుకుతో గడపడానికి ఇష్టపడతానని అన్నారు.'ఖలేజా'సినిమాలో మహేష్ సరసన 'అనుష్క' హీరోయిన్ గా నటించారు.


Click it and Unblock the Notifications











