twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికను చూసి నగ్నంగా నటించడానికి రెడీ అంటున్న ప్రియాంక చోప్రా..!

    By Nageswara Rao
    |

    ఇటీవల విడుదైన హిస్ స్ సినిమాలో బాలీవుడ్ హాట్ గర్ల్ మల్లికా శెరావత్ పూర్తి నగ్నంగా నటించి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలనాన్ని సృష్టించింది. ఐతే ఈవిషయంలో మీరు నగ్నంగా నటించారా అని అడడగా, అబ్బే నేను పూర్తి నగ్నంగా నటించలేదనీ, శరీరం రంగుల్లో ఉన్న పలుచటి వస్త్రాన్ని ధరించి కనిపించానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.

    అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో ఉన్న యూనిట్ సభ్యులు మాత్రం మల్లికా శెరావత్ అంతా అబద్దం చెబుతుందని కొట్టిపారేస్తున్నారు. మల్లిక నగ్నంగా నటించడాన్ని తామంతా కళ్లారా చూశామని చెపుతున్నారు. ఆమె సంగతి అలా ఉంచితే ఇపుడు ప్రియాంకా చోప్రా తానేమి తక్కువ తిన్నానా అంటూ తాను నటిస్తున్నటువంటి తాజా చిత్రంలో నగ్నంగా నటించే సన్నివేశంలో నటించడానికి రెడీ అందిట. తీరా సీన్ చిత్రీకరణ సమయంలో తన మనసుని మార్చుకోని బాబోయ్ నేనలా నటించను. ఇటువంటి సీన్లలో నటించడం వల్ల నాఇమేజి దెబ్బతింటుందని చివరి నిమిషంలో దర్శకుడుతో చేతులు ఎత్తేసిందంట.

    ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని దర్శకుడు అచ్చం ప్రియాంక బాడీ స్ట్రక్చర్ కలిగిన ఓ మహిళతో తన వీపు వెనుకభాగం చూపించే సీన్ చిత్రీకరించడానికి సిద్ధమయ్యాడట. ఇలా తీయడానికి కూడా ప్రియాంక అభ్యంతరం పెట్టిందట. ఎవరితో చేసినా తానే నగ్నంగా నటించానని ప్రేక్షకులు అనుకుంటారేమో...అంటూ ఆ సీన్‌ను లేకుండా చేయమని దర్శకుడితో పోట్లాటకు దిగిందట. మరి దర్శకుడు ప్రియాంక మాట వింటాడో లేదంటే తన వీపు వెనుకభాగం చూపించి తీరుతాడో చూద్దాం. ఇలా నగ్నంగా నటించే సన్నివేశాలలో బాలీవుడ్ తారలు ఒకరికొకరు పోటీ పడుతున్నట్లుగా అనిపిస్తోందని అక్కడ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X