రాజకీయాలకు దూరంగా బాలీవుడ్ మెగాస్టార్

By Bojja Kumar

కోల్ కతా: మోడీ తలపెట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ పాల్గొనడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసారు. సామాజిక బాద్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

అమితాబ్ సినిమాల విషయానికొస్తే...
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘షమితాబ్' అనే సినిమాలో నటిస్తున్నారు. ధనుష్, అమితాబ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రం ట్రైలర్ ఒకటి ఆల్రెడీ అఫీషియల్ గా విడుదల చేసి ప్రసంసంలు పొందారు. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో విడుదల చేసి మరో ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ సైతం ఇప్పుడు అటు బాలీవుడ్ లో ఇటు తమిళనాట సంచలనం క్రియేట్ చేస్తోంది. టీజర్ చూసిన వారంతా ప్రసంశల్లో ముంచెత్తుతున్నారు. హిట్ గ్యారెంటీ అంటున్నారు.

I am apolitical and shall not join politics: Amitabh Bachchan

ఈ సినిమాతో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తమ చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటినుంచి ఈ గెటప్ ను కాపాడటం చాలా కష్టమని బచ్చన్ తన బ్లాగులో కూడా రాశారు. షమితాబ్ సినిమాకు ఆర్ బాల్కి దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. తన కొత్త చిత్రం షమితాబ్ కోసం ఆయన ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ గీతాన్ని అమితాబ్ ముంబాయిలోని ఆదేష్ స్టూడియోలో ఆలపించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X