పవన్ కళ్యాణ్ హీరోయిన్ మళ్లీ వస్తోంది
పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా చోప్రా మళ్లీ తెలుగు సినిమాలపై కన్నేసింది. ఓ కేసు కారణంగా ఆ మధ్య సినిమాలకు దూరం అయిన అమ్మడు తాజాగా మళ్లీ అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో కనిపించిన ఆమెను మీడియా వారు ప్రశ్నించగా....సినిమా చేయడం లేదని ఎవరు అన్నారు, ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నానని, తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానను, ప్రస్తుతం రెండు సినిమాలు ఓకే అయ్యేలా ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. బంగారం సినిమా పరాజయం పాలైనప్పటికీ...ఆ తర్వాత మీరా నటించిన 'వాన' సినిమా మోస్తరు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక నితిన్ తో నటించిన 'మారో' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. మరి మీరా ఎంట్రీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో...మరికొన్ని రోజులు గడిస్తేగానీ చెప్పలేం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు నితిన్ 'ఇష్క్' చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ సరసన నిత్య మీనన్ రొమాన్స్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











