నేను మంచి భర్తను కాదు : ధనుష్
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి...మీరు రియల్ లైఫ్ లోనూ రొమాంటిక్ గా ఉంటారా? అనే ప్రశ్న సంధించారు. దీనికి ధనుష్ సమాధాం ఇస్తూ, ఆ విషయంలో నేను మంచి భర్తను కాదు. నా భార్య నాతో అడ్జెస్ట్ అవుతోంది అని వ్యాఖ్యానించారు. మరి ధనుష్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసారో? ఏమో..?
మీరు బాలీవుడ్లో గుడ్ లుక్ యాక్టర్‌గా ఎందుకు పేరు తెచ్చుకోలేక పోయారు అనే ప్రశ్నకు స్పందిస్తూ...'మీరు ఎలా కనిపిస్తున్నారు, స్లిమ్ గా ఉన్నారా, పొడవుగా ఉన్నారా అనేది సినిమాల్లో ముఖ్యం కాదు. మీరు పోషిం పాత్రమీదే అంతా ఆధార పడి ఉంటుంది. నేను నా వయసుకి, నా శరీరాకృతికి సరిపోయే పాత్రలు మాత్రమే ఎంచుకుంటాను. నేను బాక్సర్‌గానో, వ్రెస్లెర్ గానో తెరపై కనిపిస్తే అలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి అన్నారు.
నేను ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఉండటం వల్లనే 16 ఏళ్ల వయసు పాత్రలు కూడా చేయగలుగుతున్నాను. నేను బాలీవుడ్‌కి రావాలనే కోరిక నాకు ఎంత మాత్రమూ లేదు. స్క్రొప్టే నన్ను వెతుక్కుంటూ వచ్చింది, అందుకే ఈ సినిమా చేసాను అని వెల్లడించారు ధనుష్.


Click it and Unblock the Notifications












