‘పికె లవ్’ వివాదం: వారి కామెంట్లు బాధించాయన్న పూనమ్!

By Bojja Kumar

Recommended Video

Poonam Kaur Responds On Trolling Grom #PKFans

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో పలు కామెంట్లతో గతంలో వివాదాల్లో ఇరుక్కున్న హీరోయిన్ పూనమ్ కౌర్.... తాజాగా మరోసారి తన ట్వీట్లతో కొందరు నెటిజన్లకు టార్గెట్ అయింది. దీంతో ఆమెపై తీవ్రమైన కామెంట్స్, ట్రోలింగ్ జరుగడంతో..... బాధపడుతూ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమెపై ట్రోలింగ్ జరుగడానికి కారణం తన ట్వీట్లో 'పికె లవ్' అనే యాష్ ట్యాగ్ తగిలించడమే. అసలు ఏ సందర్భంలో ఆమె ఈ ట్వీట్ చేశారు? దీని వెనక ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఓ లుక్కేద్దాం.

పూనమ్ వీడియో

కృష్ణాష్టమి సందర్భంగా పూనమ్ సోమవారం ఉదయం ఓ టీజర్ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిన పూనమ్ అందరి ప్రశంసలు అందుకుంది. కానీ అంతలోపే మరో ట్వీట్‌తో కొందరి దృష్టిలో విలన్ అయింది.

పికె లవ్ అంటూ

నా కృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా... నా గుండె లోతుల్లో ఉన్న ప్రేమను, సంతోషాన్ని వ్యక్త పరుస్తూ ఏదైనా ఏయాలనుకుటున్నాను. ఏ సమయంలో అయినా దాన్ని రిలీజ్ చేస్తాను అంటూ పికె లవ్ హాష్ ట్యాగ్ తగిలించి...ఆమె ఓ ట్వీట్ చేసింది.

విరుచుకుపడ్డ ఫ్యాన్స్

విరుచుకుపడ్డ ఫ్యాన్స్

పికె లవ్ అంటూ ఆమె ట్వీట్ చేయడంతో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ మీద విరుచుకుపడ్డారు. విపరీతమైన ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. కొందరు చేసిన కామెంట్లకు ఆమె బాధపడుతూ మరో ట్వీట్ చేశారు. ఆమె విడుదల చేయాలనుకున్న పూర్తి వీడియో కూడా రిలీజ్ చేయలేదు.

మీ కామెంట్లు బాధించాయి

‘నేను ఎంతగా కష్టపడ్డా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత నిజాయితీగా చేసినా.... ఎవరూ పట్టించుకోరు. కానీ కొన్ని విషయాల్లో నా తప్పు లేక పోయినా నన్ను దూషిస్తున్నారు. ఇది నన్ను చాలా బాధించింది. నా హృదయానికి చాలా దగ్గరయిన వీడియో అది.. అంటూ పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X