అమ్మమ్మగారిల్లు ప్రీరిలీజ్: ఆమె గౌనుకి పెద్ద ఫ్యాన్ అంటున్న నాగశౌర్య!

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై నాగశౌర్య, బేబి షామిలి హీరో, హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'అమ్మమ్మగారిల్లు'నూతన దర్శకుడు సుందర్ సూర్య దర్శకత్వం వహించారు. మే 25న (శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన అమ్మమ్మగారిల్లు ప్రీ రిలీజ్ వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను 'మా' అధ్యక్షుడు శివాజీరాజా ఆవిష్కరించడం జరిగింది.

నాగ శౌర్య మాట్లాడుతూ...

నాగ శౌర్య మాట్లాడుతూ...

''షామిలీని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆమె నటించిన సినిమాలు చూడడం జరిగింది. ఆమె గౌనుకి నేను పెద్ద ఫ్యాన్. వైట్ గౌన్ వేసుకుని ఎగురుతూ ఉంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఆమె నా సినిమాలో హీరోయిన్ అవ్వడం సంతోషంగా ఉంది. నా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు షామిలీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను'' అన్నారు.

 హీరోయిన్ షామిలి మాట్లాడుతూ ...

హీరోయిన్ షామిలి మాట్లాడుతూ ...

''అమ్మమ్మగారిల్లు సినిమాలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంది. మంచి సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య‌ గారికి ధన్యవాదాలు. మంచి ఎన‌ర్జితో యూనిట్ స‌భ్యులంద‌రినీ మోటివేట్ చేస్తూ అందరి నుండి మంచి అవుట్ పుట్ రాబ‌ట్టుకున్నారు. నిర్మాత‌లు కుమార్, రాజేశ్‌గారికి, నాగ‌శౌర్య‌కి ప్రేత్యేకంగా ధన్యవాదాలు. మా అమ్మ‌మ్మ‌గారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావ‌ర‌ణాన్ని ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చూడ్డం జరిగింది'' అన్నారు.

 డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ...

డైరెక్ట‌ర్ సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ...

అమ్మమ్మగారిల్లు సినిమా చెయ్యడానికి అందరు చ‌క్క‌టి స‌హ‌కారం అందించారు. ఎంతో మంది ఎక్స్‌పీరియెన్స్ ఉన్న న‌టీన‌టులు ఈ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డి పనిచెయ్యడం జరిగింది. కథ నచ్చడంతో బేబి షామిలి వెంటనే ఒప్పుకోవడం జరిగింది. నాగ‌శౌర్య‌ లేక‌పోతే అమ్మమ్మగారిల్లు సినిమా లేదు. ఈ సినిమా స్క్రిప్ట్ రెండేళ్ల పాటుత‌యారు చేశాం. హీరో నాగ‌శౌర్య‌ను క‌థ వినిపించగానే పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రం కాబ‌ట్టి ఏ మాత్రం ఆలోచించ‌కుండా సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. క‌ల్యాణ్‌మాలిక్‌, సాయికార్తీక్‌ సంగీతం సినిమాకు పెద్ద హైలెట్ కాబోతోంది.

 నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ...

నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ...

''అమ్మమ్మగారిల్లు సినిమా బాగా వ‌చ్చింది. ఇంత మంచి సినిమా చేశామంటే కార‌ణం నాగ‌శౌర్య‌, షామిలి స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారమే. మా సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ నచ్చుతుంది'' అన్నారు.

స‌హ నిర్మాత కె.ఆ ర్ మాట్లాడుతూ...

స‌హ నిర్మాత కె.ఆ ర్ మాట్లాడుతూ...

''హీరో నాగ శౌర్య లేక‌పోతే ఈ సినిమా లేదు. నాగ‌శ శౌర్య గారు మా క‌థ ను న‌మ్మి సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మిగ‌తా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులో ఎంతో స‌హ‌క‌రించారు. అందువ‌ల్లే మంచి అవుట్ ఫుట్ వ‌చ్చిందని భావిస్తున్నాను. అమ్మమ్మగారిల్లు సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది'' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X