మోసం చేసారంటూ తెలుగు దర్శకుడు మీడియాతో..

By Srikanya

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ఎంపికైన తెలుగు చిత్రం 'ద లోటస్ పాండ్" వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాకు తానే దర్శకుణ్ణని, అయితే నిర్మాణ భాగస్వామి నితిన్‌కుమార్ తనను మోసం చేసి దర్శక, నిర్మాతగా పేరు వేసుకున్నారని పీజీ విందా మీడియాకు తెలియచేసారు.హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర సంగీత దర్శకుడు సునిల్ కశ్యప్,ఎడిటర్ చంద్రశేఖర్,మరో దర్శకుడు శ్రీధర్‌తో కలిసి మాట్లాడారు.

పిజి విందా మాట్లాడుతూ...తాను రెండేళ్లు ఎంతో కష్టపడి 'లోటస్ పాండ్"చిత్ర కథను తయారు చేసినట్లు పేర్కొన్నారు. డెరైక్షన్,స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ బాధ్యతలు తానే నిర్వహించానని చెప్పారు. స్నేహితుడని నమ్మి నితిన్‌కుమార్‌ను సినిమాకు 50 శాతం భాగస్వామిగా చేర్చుకున్నానని తెలిపారు. సెన్సార్ కాపీలో కూడా చిత్ర దర్శకునిగా తన పేరే ఉందన్నారు. తనకు తెలియకుండా 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం పోటీ విభాగంలో సినిమా నిర్మాత, దర్శకునిగా నితిన్‌కుమార్ పేరు పెట్టుకొని తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే..సినిమా పరంగా అన్ని రకాల హక్కులు తనకే ఉంటాయని విందా స్పష్టం చేశారు.

అంతేగాక వివాదం సమసే వరకూ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం స్క్రీనింగ్‌ను నిలిపివేయాలని కూడా ఆయన కోరారు. ప్రొడ్యూసర్‌గా నితిన్‌కుమార్ పేరు వేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.చిత్ర సంగీత దర్శకునిగా కూడా ఎవరో అనామకుని పేరు పెట్టారని, స్క్రిప్ట్ రైటర్‌గా నితిన్ భార్య స్మిత పేరు పెట్టుకున్నారని ఆరోపించారు. దర్శకునిగా అతని పేరును తీసి వేసిన తరువాతనే సినిమాను బాలల చలన చిత్రోత్సవాలకు పంపించాలని కోరారు. ఈ విషయమై దర్శక మండలిని కూడా సంప్రదిస్తానని, న్యాయ పోరాటం చేస్తానని విందా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X