మగాళ్ళే డామినేట్ చేస్తున్నారు..ఇలియానా
మగాళ్ళ రాజ్యం సినీ పరిశ్రమ..దాంతో స్త్రీ పాత్రలకు పెద్ద ప్రయారిటీ ఉండదు.దానికి మనమేమీ చేయలేం అంటోది ఇలియానా. సలీం..దుమ్మురేపుతాడు ప్రమోషన్ సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ. మీ పాత్రలకు పెద్ద ప్రయారిటీ ఉండదు కారణమేమిటి అని అడిగిన దానికి సమాధానంగా.ఇక మీ కాంపిటేటర్స్ త్రిష, అసిన్, శ్రియ హిందీలో ట్రై చేస్తున్నారు..మరి మీ ప్రయత్నాలు ఏమీ లేవా అని అడిగితే నేను తెలుగు పరిశ్రమలో కంపర్ట్ గానే ఉన్నాను. ఎప్పుడైనా మంచి స్క్రిప్టు వచ్చినప్పుడు ఆలోచిస్తాను.అయినా నా మొదటి బాలీవుడ్ వెంచర్..పెద్దదిగా ఉండాలి. తెలుగులో చేసినట్లు మంచి బడ్జెట్టు, స్క్రిప్టు, డైరక్టర్ ఉండాలి. అయినా నా పాత్ర వీక్ గా ఉంటే ఎంత పెద్ద హీరో ప్రక్కన అయినా చేయటానికి కమిట్ కాను. ఇక ప్రతీసారీ మీ డబ్బింగ్ మీరే చెప్పుకోవచ్చుగా అంటూ అడుగుతూంటారు. అయితే నేను తెలుగులో మాస్టర్ అయ్యేదాకా నిర్మాతలూ, దర్శకలూ వెయిట్ చెయ్యరు.అయినా నేను సెట్స్ పై తెలుగు మాట్లాడుతాను. అలాగే త్వరలో తాను హైదరాబాద్ షిప్ట్ అవుతానని చెప్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా నెక్ట్స్ మంత్ స్టార్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











