»   » పూర్థి స్థాయి మగాన్ని కాదు, భార్య నీడలోనే ఉంటా: అమీర్ ఖాన్

పూర్థి స్థాయి మగాన్ని కాదు, భార్య నీడలోనే ఉంటా: అమీర్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: న్యూయార్క్‌లో జరిగిన ‘ప్రపంచంలో స్త్రీ శక్తి' అనే సదస్సులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిజమైన మగాడు అంటే ఎవరు?...బలవంతుడుగా, ఇతరులను కొట్టేంత శక్తివంతుడుగా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏడవకుండా, ఎవరిమీద ఆధార పడకుండా ఉండాలా?....అలాంటి లక్షణాలు తప్పనిసరిగా ఉండాలంటే నేను పూర్థి స్థాయి మగాన్ని కాదని నిర్మొహమాటంగా ఒప్పకుంటాను అని వ్యాఖ్యానించారు. సమస్యల్లోనే కాదు.. ఏ సమస్యా లేనప్పుడూ నేను నా భార్య చేతులు పట్టుకుంటాను. ఆమె నీడని కోరుకుంటాను అంటానని స్పష్టం చేసాడు.

మగాళ్లు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చిన్నతనం నుండి తల్లిదండ్రులు చెప్పడం వల్లనే వారిలో అహంకారపూరిత మనస్తత్వం ఏర్పడుతుందని అన్నారు. భార్యలను కొట్టే మగాళ్లు చిన్నతనం నుండి అలాంటి వాతావరణంలోనే పెరుగుతారు. పురుషుడంటే ఆధిపత్యం చెలాయించాలనే ధోరణితో వారు ఉంటారు. ఇలాంటి పరిస్థితులు సమాజంలో మారాలి. స్త్రీ పురుషులు సమానం అనే ధోరణి సమాజంలో పెరగాలి అన్నారు.

Aamir Khan

భారత దేశంలో స్త్రీలపై అత్యాచారాలు పెరగడానికి గల కారణాలపై అమీర్ ఖాన్ స్పందిస్తూ... నేరస్తులకు శిక్ష పడటానికి ఎక్కువ కాలం పడుతోందనీ, నేరాలు విరివిగా జరగడానికి అదొక కారణమనీ ఆమిర్ అన్నారు. చట్టంలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారానికి గురైన స్త్రీలు మానసికంగా కుంగి పోకుండా వారి ధైర్యం చెప్పే విధంగా సమాజంలో మార్పు రావాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో వారిని విచారించే పోలీసులు, పరీక్షించే వైద్యుల ప్రవర్తన తీరులో మార్పు రావాలన్నారు.

English summary
"Who is a real man? Someone who goes and beats people up? A protector?" Aamir khan probed. In certain contexts in India, "real men aren't supposed to cry or hold their wives' hands," he added. "Based on those definitions, I am completely not a real man," Khan declared, laughing. "Not a single episode goes by without me crying."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu