భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై కంటెస్ట్ చేస్తా: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!
వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నికల వేళ ఆసక్తికర ప్రకటన చేశారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేస్తాను అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాను అంటూ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆల్రెడీ నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఇపుడు ఎన్నికల్లో పోటీ చేయానికి అవకాశమే లేదు. మరి వర్మ ఎలా పోటీ చేస్తారు? ఇది సాధ్యమేనా? అనే ప్రశ్న అందరిలో మెదిలింది. ఈ సందేహాలపై కూడా వర్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నాకు స్పెషల్ పర్మీషన్ వచ్చింది
నామినేషన్ల గడువు ముగిసిందని నాకూ తెలుసు. కానీ నాకు పై నుంచి స్పెషల్ పర్మీషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేయబోతున్నాను. పూర్తి వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ వర్మ ట్వీట్ చేశారు.

వోడ్కా ఎఫెక్టా? అసలు ఏం జరుగుతోంది..
బుధవారం అర్దరాత్రి దాటిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. ఆయన ట్వీట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత పోటీ చేసే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? వోడ్కా మత్తులో వర్మ ఈ ట్వీట్ చేశారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ పవన్ కళ్యాణ్‌ను కెలికాడు
గతంలో శ్రీరెడ్డి వ్యవహారంలో తలదూర్చి పవన్ కళ్యాణ్‌ను తిట్టించాడనే విమర్శలు ఎదుర్కొన్న రామ్ గోపాల్ వర్మ.... ఈ ఎన్నికల సమయంలో ఆయన్ను మళ్లీ కెలకడం చర్చనీయాంశం అయింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానంటున్న ఈ కాంట్రవర్సల్ డైరెక్టర్ ఏంచెప్పబోతున్నాడో చూడాలి.

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'
కాగా... రామ్ గోపాల్ వర్మ తీసిన వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' రేపు(మార్చి 29) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో చంద్రబాబును విలన్‌గా చూపించబోతున్నారని, ఈ చిత్రం ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, తెలుగు దేశం పార్టీని నష్టపరుస్తుందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











