జూ ఐశ్వర్య రాయ్ పుట్టిందంటూ సంబరాల్లో అమితాబ్ ఫ్యామిలి..!

By Sindhu

క్వీన్ ఆఫ్ బాలీవుడ్ గా పిలువబడే ఐశ్వర్య రాయ్ 2007లో లెజండ్రీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిగింది. బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ వార్తను అమితాబ్ తన ట్విట్టర్ లో నేనొక అందమయిన చిన్నారికి తాతయ్యానంటూ ప్రకటించారు. అభిషేక్ బచ్చన్ కూడా పాపాయి పుటింది అని అభిమానులకు తెలిపాడు. కాన్పు సమయంలో ఐశ్వర్య తల్లి తండ్రులు మరియు బచ్చన్ కుటుంబ సభ్యులు ఆవిడతోనే ఉన్నారు. ఐశ్వర్య కాన్పు సందర్భంగా ఆసుపత్రి చుట్టూ కట్టుదిట్టమయిన భద్రత ఏర్పాటు చేసారు.

ఈ రోజు ఉదయం సమయంలోని ముంబాయి లోని సెవెన్ హిల్స్ హాస్పటిల్ లో ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు తల్లి అయ్యారు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ అభిషేక్ ధ్రువీకరించారు. ఐశ్వర్యారాయ్ ఆడపిల్ల జన్మించిందన్న వార్తతో ఒక్కసారిగా అభిషేక్ కు అభినందనల జల్లు మొదలయ్యింది. మీడియా స్వీయ నియంత్రణ సంస్థ ఆదేశాల వలన మీడియా ఈ విషయం పై ఎక్కువగా స్పందించలేదు. మరిన్ని విషయాలు బచ్చన్ ఫ్యామిలీ నుంచి సాయంత్రం లోపు వెలువడే అవకాశం ఉంది.

ఒకవిధంగా చెప్పాలంటే, ఐశ్వర్య కాన్పు విషయం గత కొన్ని రోజులుగా దేశంలోనే అత్యంత ప్రాధాన్యతా విషయాల్లో ఒకటిగా ముందుంది. ఆమె కాన్పుపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగింది. ఆమె డెలివరీ తేదీపైనా, పుట్టబోయే బిడ్డపైనా కూడా పందాలు వేశారు. విశిష్ట రోజుగా ప్రాధాన్యత సంతరించుకున్న 11.11.11న ఆమె కాన్పు జరుగుతుందని కొందరూ, బాలల దినోత్సవమైన నవంబర్ 14న జరుగుతుందని మరికొందరూ బెట్ వేశారు. అందరి అంచనాలనూ తలక్రిందులు చేసి, చివరికి ఆమె ఈ రోజు తల్లి స్థానాన్ని పొందింది..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X