సంజయ్ గుప్తా, మణిరత్నం సినిమాలు చేస్తున్నా: ఐశ్వర్యరాయ్
హైదరాబాద్: ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా? ఆమె అందాల సౌందర్యాన్ని వెండి తెరపై తనివితీరా ఎప్పుడు చూద్దామా...అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. ఆమె రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చే సినిమా కాగా, మరొకటి మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న సినిమా. విషయాలను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఐశ్వర్యరాయ్ స్వయంగా వెల్లడించారు.

ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ....నేను మళ్లీ సినిమాలు చేయడాన్ని అందరూ 'కంబ్యాక్' అంటూ వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఇలా పరిగణిస్తున్నారో అర్థం కాలేదు. కేవలం నేను మెటర్నిటీ బ్రేక్ మాత్రమే తీసుకున్నాను. సినిమా పరిశ్రమను విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. స్టూడియోలకు వెలుతున్నాను, ఎండార్స్‌మెంట్లు చేస్తున్నాను. మూవీ ఫెస్టివల్స్‌కి అటుండ్ అవుతున్నాను. కేవలం నా బిడ్డ మొదటి రెండున్నర సంవత్సరాలు దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ఈ సంవత్సరం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు.
సంజయ్ గుప్తా దర్శకత్వంలో యాక్షన్ సినిమాతో పాటు, మణిరత్నం సినిమాలో నటించబోతున్నాను. మణిరత్నం లాంటి దర్శకులతో పని చేయడాన్ని ఎంతో గొప్పగా ఫీలవుతున్నాను. నా సినిమా కెరీర్ ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఇరువుర్' చిత్రంతో మొదలు పెట్టాను. ఆయన సినిమాల్లో క్రియేటివిటీ ఉట్టిపడుతుంది అని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











