‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇష్యూలో సెన్సార్ బోర్డు మీద కేసు వేయబోతున్న ఆర్జీవీ
Recommended Video

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయితే మార్చి 22న విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధంగా ఉండగా... బోర్డ్ నుంచి క్లియరెన్స్ రావడం ఆలస్యం అవుతోంది. గత వారం రోజుల నుంచి దాని కోసం ఎదురు చూస్తున్న వర్మ... తాజాగా అందిన నోటీసుతో షాకయ్యారు.
సెన్సార్ బోర్డు వారు ఇల్లీగల్‌గా సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తన సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంలేది, తాను ఈ విషయంలో వారిని కోర్టుకు లాగబోతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన భారీ లేఖ సంధించారు.

ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయ్యేంత వరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు
మొదటి దశ ఎన్నికలు 11-04-2019న ముగిసే వరకు తాము సెన్సార్ కోసం అప్లై చేసుకున్న దరఖాస్తు ప్రాసెస్ చేయబోము అని వారు లిఖిత పూర్వకంగా తెలియజేశారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ సినిమా పొలిటికల్‌గా ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు చెప్పారని... ఆర్జీవి ట్వీట్ చేశారు.

నిబంధనల ప్రకారం వారికి ఆ హక్కు లేదు
సినిమాటోగ్రఫీ చట్టం, 1952 ప్రకారం సెన్సార్ బోర్డుకు సినిమా సెన్సార్ ప్రాసెసింగ్ వాయిదా వేసే అధికారం లేదని, వారి చర్య భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విధంగా ఉందని రామ్ గోపాల్ వర్మ తన స్టేట్మెంటులో పేర్కొన్నారు.
సెన్సార్ బోర్డు మీద కేసు పెట్టబోతున్నాను
సెన్సార్ బోర్డ్ పని సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే నిబంధనల ప్రకారం వాటిని తొలగించడం మాత్రమే. కానీ నిబంధనలకు విరుద్ధంగా సినిమా రిలీజ్ వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై తాను సెన్సార్ బోర్డు మీద కోర్టులో కేసు వేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

టీడీపీ అభ్యంతరం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సినిమాలో హైలెట్స్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగే పరిణామాలను ఫోకస్ చేస్తూ సాగుతుంది. ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలు, వెన్నుపోటు పర్వం ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











