ఇష్టం లేకపోయినా చేస్తున్నా:రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏం ట్వీట్ చేసినా అది హాట్ టాపిక్కే. తాజాగా ఆయన తాను తనకు రాత్రి సీన్స్ షూటింగ్ చేయటం ఇష్టం ఉండదని,కానీ తప్పనిసరిగా ఫోర్స్ చేసి చేస్తున్నా అంటూ ట్వీట్ చేసారు. అయితే రాత్రి వేళ షూటింగ్ చేస్తేనే మంచి ఎఫెక్ట్ ఇస్తుందని అన్నారు. అలాగే ప్రస్తుతం స్లో మోషన్ సీన్స్ తీస్తున్నానని,అది హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది అన్నారు. ఇక మూడు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అలాగే ప్యాచ్ వర్క్ మిగిలింది అన్నారు. ఆయన తాజా చిత్రం ఈగ గురించే అని వేరే అని చెప్పక్కర్లేదు. సమంత,నాని,కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది.సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications











