అమ్మదే ఈ అవార్డ్: రెహమాన్

'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలోని 'ఓ సాయా', 'జై హో' గీతాలతో ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న తొలి భారతీయుడుగా ఆయన సంచలనం సృష్టించారు. రెహ్మాన్ ను రెండు అవార్డులకు ఎంపిక చేసినట్టు ప్రకటించిన వెంటనే ఆయన ఆనందాతిశయాలతో తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. 'ఎల్లా పుగళం ఇరైవనుకే' (అంతా దైవకృప) అంటూ ప్రతిస్పందించారు. అదే సమయంలో ఆస్కార్ పురస్కారాలను తనకెంతో ప్రాణప్రదమైన తల్లి కరీమ బేగంకు అంకితం చేశారు.


Click it and Unblock the Notifications











