twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మదే ఈ అవార్డ్: రెహమాన్

    By Staff
    |

    AR Rahman
    'మా పాస్ మా హై' అంటూ ఓ హిందీ సినిమాలో ఓ డైలాగు ఉంది...దాని అర్ధం..నా దగ్గర ఏమీలేదు..అమ్మ తప్ప అని..అలాగే మా అమ్మ ఇక్కడ ఉంది..ఆమె ఆశ్వీర్వాదాలు నాపై ఉన్నాయి. జన్మనిచ్చింది మొదలు ఈక్షణం వరకూ ఆమె నా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంది. ఈ రోజు నేను ఇక్కడ వరకు చేరుకోవడానికి ఆమె ఆశీస్సులే కారణం. అవార్డుకు అర్హుడ్ని చేసిన అకాడమీకి, జ్యూరీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. స్లమ్ డాగ్ మిలయనీర్ కు పనిచేసిన గుల్జార్, రకీబ్ అలమ్, బ్లాజే, చెన్నై, ముంబైలోని నా సహచర సంగీత కళాకారులందరికీ నా కృతజ్ఞతలు' అంటూ దక్కిన జంట ఆస్కార్ అవార్డులను స్వీకరిస్తూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు ఏఆర్ రెహ్మాన్.

    'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంలోని 'ఓ సాయా', 'జై హో' గీతాలతో ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న తొలి భారతీయుడుగా ఆయన సంచలనం సృష్టించారు. రెహ్మాన్ ను రెండు అవార్డులకు ఎంపిక చేసినట్టు ప్రకటించిన వెంటనే ఆయన ఆనందాతిశయాలతో తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. 'ఎల్లా పుగళం ఇరైవనుకే' (అంతా దైవకృప) అంటూ ప్రతిస్పందించారు. అదే సమయంలో ఆస్కార్ పురస్కారాలను తనకెంతో ప్రాణప్రదమైన తల్లి కరీమ బేగంకు అంకితం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X