twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: ఇలియానా ‘సహజీవనం’

    By Srikanya
    |

    ముంబై: దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వలస వెళ్లిన ఇలియానా తనకు సహజీవంపై ఆసక్తి ఉందని మీడియాకు తెలియపరిచింది. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ...' నాకిప్పట్లో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచన లేదు. పెళ్లి చేసుకోవాలంటే వేలికి ఉంగరం తొడిగించుకోవాలనో, బాండ్ పేపర్ మీద ఒప్పందం కుదుర్చుకోవాలనో నేను అనుకోను. మన జీవితం మన ఇష్టం. నాకు సహజీవనం సమ్మతమే'' అంది.

    సహజీవనం చేయటానికి ఎవరినైనా ఎన్నుకున్నారా అని అడిగితే.. ''అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. రైట్ టైమ్ వచ్చినప్పుడు ఆ విషయం గురించి చెబుతా'' అంటూ తేల్చి చెప్పింది. అంటే ఇప్పటికే ఆమె ఆలోచనలో ఎవరైనా ఉన్నారా.. లేక ఆమె సహజీవనంలోనే ఉందా అనే సందేహాలు అందరికీ కలిగాయి.

    అలాగే తాను వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని ఈ గోవా బ్యూటీ తేల్చి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..."కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం'' అంది.

    అలా ఎట్రాక్ట్ అవటానికి కారణం చెప్తూ..."సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు'' అని చెప్పింది ఇలియానా.

    తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 20 చిత్రాలు చేసిన తర్వాత 'బర్ఫీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కి వెళ్లారు ఇలియానా. ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించడంతో పాటు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. సినిమాతోపాటు ఇలియానాకి కూడా ఈ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం 'ఫటా పోస్టర్ నిఖ్‌లా హీరో' అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ గోవా బ్యూటీ. షాహిద్‌కపూర్‌తో కలిసి తను నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. 'బర్ఫీ'లో సంప్రదాయబద్ధమైన పాత్ర చేశానని, తాజా చిత్రంలో మోడర్న్ గాళ్‌గా నటిస్తున్నానని ఇలియానా చెబుతున్నారు.

    తొలి చిత్రంలో సీరియస్ ఇలియానాని చూశారని, ఇందులో అందుకు భిన్నంగా కనిపిస్తానని కూడా ఆమె పేర్కొన్నారు. మరిన్ని విశేషాలను ఇలియానా చెబుతూ -''దక్షిణాదిన కమర్షియల్ హీరోయిన్‌గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాను. బాలీవుడ్‌లో కూడా ఆ ఇమేజ్‌నే కోరుకుంటున్నాను. రాజ్‌కుమార్ సంతోషి మాస్ మసాలా ఫిల్మ్స్ బాగా చేస్తారు. అందుకని ఆయన దర్శకత్వంలో నా రెండో సినిమా కుదరడం చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు. దక్షిణాదిన నిరూపించుకుని, ఉత్తరాది వెళ్లి అక్కడ కూడా మంచి అవకాశాలు తెచ్చుకుంటున్నారు.

    English summary
    I am actually sceptical about the institution of marriage. I can see myself living in with someone but I can’t really picture myself getting married. As of now, I don’t see it happening. But things change, so you never know. I can’t put it down on paper and say why I am sceptical about it. I have seen marriages work. But I guess I don’t need a ring around my finger or a piece of paper to tell me that this seals my bond with my man.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X