twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ అరెస్ట్: "హే చంద్రబాబు... ఇదేనా ప్రజాస్వామ్యం, ఇది నిజానికి వెన్నుపోటు"

    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు చిత్రబృందం మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    వర్మతో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ నిర్మాత రాకేష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎయిర్ పోర్టుకు తరలించారు. విజయవాడ నుంచి వెళ్లిపోవాలంటూ పంపించేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.

    మమ్మల్ని బలవతంగా ఆపేశారు

    మమ్మల్ని బలవతంగా ఆపేశారు

    ‘‘విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వెళుతుంటే పోలీసులు మా వాహనాలను ఆపేశారు. బలవంతంగా వేరే కారులో ఎక్కించేశారు. ఇక్కడ ఎలాంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. విజయవాడ రావడానికి వీల్లేదు, విజయవాడలో ఎక్కడా ఉండటానికి వీల్లేదు అని తీసుకొచ్చి మళ్లీ ఎయిర్‌పోర్టులో పడేశారు.'' అని వర్మ తెలిపారు.

    నిజం చెప్పడమే నేను చేసిన నేరం

    నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను. నేను చేసిన ఒకే ఒక నేరం నిజం చెప్పడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు. పోలీసులు ఎందకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. మేము విజయవాడ ఎందుకు రాకూడదు, ఇక్కడ ఏ హోటల్‌లో ఎందుకు ఉండకూడదు? అని అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదని వర్మ తెలిపారు.

    హోటల్ వాళ్లను బెదిరించారు

    హోటల్ వాళ్లను బెదిరించారు

    ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్‌లో నిర్ణయించాం, కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వటంతో భయంతో మాకు ఇచ్చిన అనుమతి కేన్సిల్ చేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటట్స్, క్లబ్బుల మేనేజ్మెంట్లు మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు.'' అంటూ వర్మ అంతకు ముందు ఓ ట్వీట్ చేశారు.

    పైపుల రోడ్డులో నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానంటూ

    పైపుల రోడ్డులో నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానంటూ

    ‘‘అందుకే పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. మీడియా మిత్రులకి, ఎన్‌టి‌ఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరూ నేను పెట్టబోతున్న మీటింగులో పాల్గొన్నడానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం.'' అంటూ వర్మ తెలిపారు.

    పోలీసులు అందుకే అరెస్టు చేశారా?

    పోలీసులు అందుకే అరెస్టు చేశారా?

    వర్మ రోడ్డు మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అక్క పెద్ద గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందుగా ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో విడుదల కావాల్సిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్నికల కారణంగా కోర్టు వివాదంతో విడుదల ఆగిపోయింది. ఈ చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు వర్మ విజయవాడ వచ్చారు.

    హే చంద్రబాబు... ఏదయ్యా ప్రజాస్వామ్యం? నిజం ఎందుకు వెన్నుపోటుకు గురవుతోంది?

    పైపుల రోడ్డులో ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించలేక పోతున్నాను. పోలీసులు నన్ను అడ్డుకుని విజయవాడలోకి రాకుండా బ్యాన్ చేశారు. తిరిగి హైదరాబాద్ పంపించేశారు. హే చంద్రబాబు నాయుడు.. నువ్వు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏది ప్రజాస్వామ్యం? ఎందుకు నిజం వెన్నుపోటుకు గురవుతుంది? అంటూ ఘాటు వర్మ ట్వీట్ చేశారు.

    English summary
    "I am In police custody now for the only crime of trying to tell truth ..THERE IS NO DEMOCRACY IN ANDHRA PRADESH" RGV tweeted after ViJayawada police arrest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X