'మర్యాద రామన్న' లో ఆ ఆర్టిస్టుని అనుకరించి చేసా...సునీల్
మర్యాద రామన్న చిత్రంలో రాము పాత్రకు గానూ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుని చాలా చోట్ల ఇమిటేట్ చేసారని అంటున్నాడు సునీల్. కానీ అది స్క్రీన్ ప్లే లో బాగా కలిసిపోయి ఆ తేడా కనపడకుండా పోయింది. అందుకునే ఈ రోజున అందరి మన్ననలూ పొందగలుగుతున్నాను. ఇప్పుడు నాకు సీరియస్ పాత్రల నుంచి ఎలా హాస్యం పండించాలో అర్ధమైంది అంటున్నాడు సునీల్. అలాగే తనని రాజమౌళి పిలిచి హీరోగా సినిమా చేస్తాననగానే షాక్ అయ్యానని, అయితే అదే నిజం అయ్యిందని చెప్తున్నాడు. ఇక ఈ చిత్రం చేసే ముందు..రాజమౌళి..కొంతమంది కమిడియన్స్ యాక్టింగ్ స్టైల్స్ ని అబ్జర్వ్ చేయమని చెప్పారని, అయితే ఆ సూచన మొదట తనకు అర్ధం కాలేదని, తర్వాత సినిమా ప్రారంభమయిన తర్వాత ఆ సూచన ఉపయోగం కనపడిందని అన్నారు. ఇక ఈ ఫుల్ లెంగ్త్ కామిడీ కోసం రేలంగి, కోట శ్రీనివాసరావు వంటి మరికొంత మంది ఆర్టిస్టుల ఎక్సప్రెషన్స్ గమనించానని అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











