అతణ్ణి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం అంటున్న హీరోయిన్!
హీరోయిన్ నికీషా పటేల్ ఒక బ్రిటిష్ ఇండియన్ మోడల్ మరియు సినిమా హీరోయిన్. ఆమె SJ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన , 2010 తెలుగు సినిమా పులి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. యు.కే లో పుట్టి పెరిగిన ఈ హీరోయిన్ తాజాగా ఒక సంచలనమైన కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్ కు అందరు షాక్ అవుతున్నారు.
ఇండియన్ మైకేలా జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రభుదేవా తన భార్యతో మనస్పర్ధల కారణంగా కొంతకాలం క్రితమే డైవర్స్ తీసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. డైవర్స్ తరువాత ప్రభుదేవా కొంతకాలం నయనతారతో రిలేషన్ లో ఉన్నాడు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నికీషా పటేల్ మాట్లాడుతూ... నాకు ప్రభుదేవా నటన, డాన్స్ అంటేచాలా ఇష్టం, మా కుటుంభానికి ఆయన కుటుంభానికి దగ్గర సంభందాలు ఉన్నాయి. ఆయణ్ని పెళ్లి చేసుకోవడానికైనా సిద్ధమే'' అని నికీషా చెప్పింది.


Click it and Unblock the Notifications











