లవ్ స్టోరీలతో నావద్దకు రావద్దంటున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ ఈసంవత్సరం లవ్ స్టోరి సినిమాలకు చాలా దూరంగా ఉండాలని అనుకున్నట్లు సమాచారం. ఇది మాత్రమే కాకుండా ఈసంవత్సరం తీసేటటువంటి అన్ని సినిమాలు కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లు తెలస్తోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ వివి వినాయక్ దర్శకత్వంలో బధ్రినాధ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాకి కధను చిన్ని కృష్ణ అందించడం జరిగింది. ఈసందర్బంలో చిన్నికృష్ణ మాట్లాడుతూ ఈసినిమా హైవోల్టేజ్ యాక్షన్ తోకూడుకున్నదని అన్నారు.
ఈసంవత్సరం విడుదల కాబోతున్న బధ్రినాధ్ పై అల్లు అర్జున్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈసినిమా యాక్షన్ సినిమా కాబట్టి తర్వాత రాబోయే సినిమాలు కూడా యాక్షన్ సినిమాలు ఐతే బాగుంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడంట. అందుకే తన దగ్గరకు వచ్చేటటువంటి దర్శకులకు ప్రేమ కధ సినిమాలు కాకుండా యాక్షన్ సినిమాలు ఐతే వెంటనే ఒప్పుకుంటానని చెబుతున్నట్లు అంటున్నారని సమాచారం. బధ్రినాధ్ సినిమాలో అల్లు అర్జున్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గానటిస్తున్నారు. ఇకపోతే ఈసినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











