ఇక నేను ఏ పార్టీ కాదు: రాజకీయాలకు నిర్మాత బండ్ల గణేష్ గుడ్ బై!

Recommended Video

'I Am Leaving Politics.. Now I'm Not A Person Of Any Political Party Says Bandla Ganesh || Filmibeat

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన చాలా మంది స్టార్స్ ఏదో ఒక సందర్భంలో రాజకీయాల్లోకి ప్రవేశించడం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ అయింది కొందరు మాత్రమే. తమకు రాజకీయాలు సరిపడవని రియలైజ్ అయిన చాలా మంది వాటి నుంచి వైదొలగించిన సందర్భాలు అనేకం

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పెచ్చుకున్న ప్రముఖ తెలుగు నిర్మాత బండ్ల గణేష్... ఆ సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే తాజాగా గణేష్ ఎవరూ ఊహించనిన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్య పరిచారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను

రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను

"నా వ్యక్తి గత కారణాల‌తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ‌కి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి‌గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను.'' బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

అది నిన్ను వదలదు

‘‘అవకాశవాద రాజకీయాలు వద్దు సోదరా గణేష్. రాజకీయంలోకి దిగడం అనేది పచ్చబొట్టు కొట్టిచుకోడం లాంటిది. నువ్వు దాన్ని చేరేపేద్దాం అనుకున్న అది నిన్ను వదలదు. ఏదేమైనా నువ్వు జీవితంలో చేసిన తప్పేమన్న ఉందా అంటే ప్రశాంతమైన జీవితం వదులోకొని బురదలో కాలు పెట్టడమే!'' అంటూ కొందరు గణేష్ నిర్ణయంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

అక్కడ సినిమా నటన సరిపోదు భయ్యా..

‘‘రాజకీయం తెలుసుకోవాలంటే నిజ జీవితంలో కూడా నటించాలి... ఇక్కడ సినిమా నటన సరిపోదు భయ్యా!! అంతకుమించి కావాలి.'' అని మరికొందరు గణేష్ నిర్ణయంపై తమ సంగీభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలంటే షార్ట్ టర్మ్ గోల్ కాదు

‘‘రాజకీయాలు అంటే షార్ట్ టర్మ్ గోల్ కాదు. ఓడినా, గెలిచినా నువ్వు ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇలా మధ్యలోనే తప్పుకోవడం పోరాటం చేసే వ్యక్తుల లక్షణం కాదు'' అంటూ కొందరు గణేష్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

అప్పుడే మీ రాజకీయ జీవితానికి శుభం కార్డ్ పడిందా?

‘‘అప్పుడే మీ రాజకీయ జీవితానికి శుభం కార్డ్ పడిందా?? లేదంటే మళ్ళీ రాజకీయాల్లో వంద మాట్లాడుతాం, అన్ని చేస్తామా ఏంటి అని #7Oclock బ్లేడ్ కి ఇచ్చిన సమాధానం ఇస్తారా?? ఏమైనా మీరు ఇలా చేయడం వల్ల మేము ఒక పొలిటీషయన్‌ను మిస్సవుతున్నాం'' అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X