బాలయ్య పుణ్యమా అని మంచి జోష్ మీద ఉన్న హీరోయిన్....
'బద్రి"లో అమీషా పటేల్ ని చూసి 'టాలీవుడ్ కి టాప్ హీరోయిన్ దొరికింది" అనుకున్నారు అంతా. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం తెలుగు సినిమాలను నిర్లక్ష్యం చేసి..బాలీవుడ్ బాట పట్టారు. అక్కడ 'కహోనా ప్యార్ హై"ని మినహాయిస్తే… దాదాపు అన్నీ పరాజయాలే. అడపా దడపా తెలుగులో చేసిన నరసింహుడు, నాని సినిమాలు తనకి పెద్దగా పేరు తేకపోవడంతో… అటు బాలీవుడ్ కీ, ఇటు టాలీవుడ్ కీ చెడి రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైంది ఆమె పరిస్థితి.
అయితే ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు అమీషా మంచి జోష్ మీదున్నారు. దానికి కారణం 'పరమవీర చక్ర". బాలకృష్ణకు జోడీగా 'పరమవీర చక్ర"లో ఆమె నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించడం తథ్యమనీ, టాలీవుడ్ లో తప్పక మళ్లీ విజయబావుటా ఎగురవేస్తానని నమ్మకం వ్యక్తపరిచారు అమీషా.
ఇంకా ఆమె మాట్లాడుతూ 'బాలకృష్ణ లాంటి టాప్ స్టార్ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. పైగా ఈ సినిమాలో నా పాత్ర కీలకమైంది. నాతో పాటు షీలా, నేహా దూపియా హీరోయిన్లుగా చేసినా… ఎవరి ప్రాధాన్యం వారికుంది. వేస్ట్ క్యారెక్టర్ అంటూ ఉండదీ సినిమాలో. 'పరమవీర చక్ర"తో తప్పకుండా హిట్ కొడతా. ఇది నమ్మకంతో చెబుతున్న మాట" అని ధీమా వ్యక్తం చేశారు అమీషా.


Click it and Unblock the Notifications











