twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా నో హ్యపీ, త్రివిక్రమ్‌తో1000 కోట్ల మూవీ, చిరుకు వడ్డీతో ఇవ్వాలి : హీరో సునీల్

    By Bojja Kumar
    |

    సునీల్ నటించిన '2 కంట్రీస్' మూవీ డిసెంబర్ 29న విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ సినిమా గురించిన విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పారు.

    సినిమాలో తన పాత్ర గురించి

    సినిమాలో తన పాత్ర గురించి

    ఈ సినిమాలో నా క్యారెక్టర్ విలేజ్ పర్సన్. నా పాత్రకు ఇంకో కంట్రీతో రిలేషన్ ఎలా అంటే... ఎవడిదో పెళ్లి సంబంధాన్ని చెడగొడదామనుకుని నేను కనెక్ట్ అయిపోయి... వాడిది చెడగొడుతున్నాను అనుకుంటూ నేను కనెక్ట్ అయిపోయి, ఒకే ఇది మంచి సంబంధం, గ్రీన్ కార్డ్ ఫ్రీగా వస్తుంది అనే ఆలోచనతో, డబ్బుల కోసం చేసే క్యారెక్టర్. అయితే క్యారెక్టర్ మాత్రం బ్యాడ్ కాదు. వీడికి అప్పులు బాగా ఉంటాయి, మనీ కావాలి, డబ్బు కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకుని ఆ అమ్మాయిని చూసి మారతాడు..... అని సునీల్ తెలిపారు.

    Recommended Video

    చిరు తర్వాత నాని నే..! | Filmibeat Telugu
    అందరూ మంచోళ్లే ఉంటారు

    అందరూ మంచోళ్లే ఉంటారు

    ఇందులో మెయిన్ విలన్ లాంటి నెగెటివ్ క్యారెక్టర్లు అయితే ఉండవు. సినిమాలో అక్కడక్కడా ఇన్సిడెంటల్ గా నెగెటివ్ పర్సన్స్ వచ్చి వెళ్లి పోతారే కానీ, పర్మినెంటుగా ఒక నెగెటివ్ క్యారెక్టర్ సినిమా అంతా రన్నవ్వడం ఉండదు. సినిమాలో అందరూ మంచోళ్లే ఉంటారు. సిచ్యువేషన్ బట్టి ఒకరిద్దరు నెగెటివ్ గా నిలబడటం తప్ప సినిమాలో అసలు విలన్ క్యారెక్టర్ లేదు. చాలా రోజుల తర్వాత నా కైండ్ ఆఫ్ సినిమా చేశాను.... అని సునీల్ తెలిపారు.

     40 శాతం కట్ చేసినా, ఇంకా 90 శాతం కామెడీ ఉంది

    40 శాతం కట్ చేసినా, ఇంకా 90 శాతం కామెడీ ఉంది

    సినిమాలో అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దొరుకుతాయి. 40 శాతం కామెడీ కట్ చేసిన తర్వాత కూడా ఇంకా 90 శాతం కామెడీ ఉంది. సినిమా ఫస్టాఫ్ గంట 40 నిమిషాలు వచ్చేసింది. నేనే మాగ్జిమమ్ డైలాగ్ చాలా స్పీడుగా, ఫాస్టుగా చెబుతాను. మీరు పది పేజీల సీన్ నాకు ఇస్తే... దాన్ని 3 పేజీల సీన్ అనిపించేలా చేస్తాను. ఎదుటివారు చెప్పడమే లేటు. రవితేజగారు, నేను కాంబినేషన్ పడితే.... 20 పేజీల సీన్ 2 పేజీల్లో అయిపోతుంది. ‘2 కంట్రీస్' లో నా నుండి కోరుకునే కామెడీ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేపుడు చిన్న ఎమోషనల్ ఫీలింగుతో ప్రేక్షకులు వస్తారు. లాస్ట్ 2 సీన్లు తప్ప సినిమా అంతా కామెడీయే.... అని సునీల్ తెలిపారు.

     హీరోయిన్ ఎంపిక విచిత్రంగా జరిగింది

    హీరోయిన్ ఎంపిక విచిత్రంగా జరిగింది

    హీరోయిన్ గురించి చెప్పాలంటే.... సినిమా లొకేషన్లు చూడటానికి కెమెరామెన్ రాంప్రసాద్, డైరెక్టర్ గారు యూఎస్ఏ వెళ్లారు. వెళ్లినపుడు మనీషా రాజ్(హీరోయిన్) గారి ఇంట్లో గెస్ట్ గా దిగారు. అప్పటికీ ఆమెను హీరోయిన్ గా అనుకోలేదు. యూఎస్ఏలో ఆమె ఫాదర్, మదర్ డాక్టర్స్. అక్కడ ఆ అమ్మాయిని చూసి సినిమాకు అడగొచ్చా లేదా అని కాస్త ఇబ్బంది పడ్డారు. ఆమె వాస్తవానికి హాలీవుడ్లో సింగర్ అవ్వడానికి ట్రై చేస్తోంది. తను గిటారిస్టు కూడా. మన సినిమా క్యారెక్టర్ కూడా ఎన్నారై క్యారెక్టరే, పైగా ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి. యూఎస్ఏలో పుట్టి పెరగడం వల్ల అక్కడి కల్చర్ ఉంది. అలాగే ఇండియన్ కల్చర్ ఉంది. ఆ అమ్మాయి పర్ఫెక్ట్‌గా సూటవుతుంది కదా అని అడిగారు. మొదట వాళ్ల అమ్మా, నాన్నఒప్పుకోలేదు. తర్వాత కన్విన్స్ చేశారు. సరే ఈ సినిమా వరకు చేస్తుంది అని ఓకే చెప్పారు... అని సునీల్ తెలిపారు. .

    చిన్నపుడు నేను ఎత్తుకున్న పాపే హీరోయిన్, షాకయ్యాను

    చిన్నపుడు నేను ఎత్తుకున్న పాపే హీరోయిన్, షాకయ్యాను

    నేను సొంతం సినిమాకు షూటింగ్ కోసం తొలిసారి ఫారిన్ వెళ్లాను. న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది. అపుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు సింగపూర్ వెళదాం అంటే వెళ్లాను. అక్కడ చాలా మంది అభిమానులు మాతో ఫోటోలు దిగారు. అదే సమయంలో ఒక యంగ్ కపుల్ వచ్చి మాతో ఫోటో దిగారు. వారి పాపను ఎత్తుకోమంటే ఎత్తుకుని ఫ్యామిలీ ఫోటో దిగాను. ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత హీరోయిన్ ఫాదర్ మా అమ్మాయిని మీరు చిన్నపుడు ఎత్తుకున్నారు గుర్తుందా? అన్నారు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. మీరు సింగపూర్లో ఎయిర్ పోర్టులో మాతో ఫోటో దిగారు. ఆ పాపే ఇపుడు మీ సినిమాలో హీరోయిన్ అనగానే షాకయ్యాను.... అని సునీల్ తెలిపారు.

     కమెడియన్‌గా ఉన్నపుడే హ్యాపీగా ఉన్నాను

    కమెడియన్‌గా ఉన్నపుడే హ్యాపీగా ఉన్నాను

    మీరు కమెడియన్‌గా హ్యాపీగా ఉన్నారా? హీరోగా హ్యాపీగా ఉన్నారా? అంటే కమెడియన్ గానే హ్యాపీగా ఉన్నాను అని సునీల్ సమాధానం ఇచ్చారు. కమెడియన్ అయితే సక్సెస్ కి, ఫెయిల్యూర్ కి సంబంధం లేదు. అన్ని సినిమాల్లో వస్తాం. ఎక్కువ సార్లు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవుతాం. హీరో అయిన తర్వాత అందరికీ దూరం అయిన ఫీలింగ్ ఉంది. నాకు రెగ్యులర్ గా అందరినీ కలిసే అలవాటు కూడా లేదు. షూటింగ్ లేకుంటే ఇంటి దగ్గర ఉంటాను. ఎప్పుడైనా జిమ్ముకు వర్కౌట్ కోసం వెళతాను. ఎవరైనా అవసరం ఉంటే పిలుస్తారు, మధ్యలో వెళ్లి వారిని డిస్ట్రబ్ చేయడం ఎందుకు? అని వెళ్లను. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే పంజాగుట్టలో నేను త్రివిక్రమ్, ఇంకా ఫ్రెండ్స్ ఉన్న మా పాత రూంకు వెళతాను. కలిస్తే త్రివిక్రమ్‌నే కలుస్తాను. ఆ రూం ఇంకా ఉంది.... అని సునీల్ తెలిపారు.

     చిరంజీవి గారికి వడ్డీతో సహా ఇవ్వాలి

    చిరంజీవి గారికి వడ్డీతో సహా ఇవ్వాలి

    నా ప్రతి సినిమా విజయం సాధించినా, అపజయం సాధించినా... ఎవరిని కలిసినా, కలవక పోయినా నా ప్రతి సినిమా తర్వాత చిరంజీవిగారిని ఒక్కరినే కలుస్తాను. నాకు ఆయనంటే ధైర్యం. విజయం వచ్చినపుడు ఆయన సినిమా బావుందని చెబితే మరింత ఉత్సాహం వస్తుంది, అపజయం వస్తే ఆయన ఏం పర్లేదు సునీల్, నువ్వు ఫెయిల్ అవ్వలేదు, అందరికీ ఉంటాయి ప్లాపులు అని ధైర్యం ఇస్తారు. ఆయన నాకు ఇచ్చేదంతా ఆయనకు, ఆయన ఫ్యామిలీకి వడ్డీతో సహా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. డాన్స్ నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఆయన్ను చూసే నేర్చుకున్నాను... అని సునీల్ తెలిపారు.

     త్రివిక్రమ్ చాలా పెద్ద మ్యాచ్ ఆడుతున్నాడు

    త్రివిక్రమ్ చాలా పెద్ద మ్యాచ్ ఆడుతున్నాడు

    త్రివిక్రమ్ తో మీ సినిమా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అనే ప్రశ్నకు సునీల్ స్పందిస్తూ..... ఆయనకు ఎప్పుడో నాకు సెట్టయ్యే కామెడీ స్కిప్టు ఐడియా వస్తే మా కాంబినేషన్లో సినిమా వస్తుంది. అది వస్తుందని అనుకుంటున్నాను. సినిమా ఉన్నా లేకున్నా మేమిద్దరం కలిసే ఉంటాం. తను పెద్ద మ్యాచ్ ఆడుతున్నాడు. తనకూ నాతో చెయ్యాలని ఉంటుంది. కానీ ఒక కమిట్మెంటు తర్వాత ఇంకో కమిట్మెంటు వస్తోంది. నాతో ఏదో ఒకటి చేయాలని కాకుండా... మనసులో నుండి వచ్చినపుడు, నాకు సూటైనపుడు చేస్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుంది.

     త్రివిక్రమ్‌తో రూ. 1000 కోట్ల సినిమా

    త్రివిక్రమ్‌తో రూ. 1000 కోట్ల సినిమా

    త్రివిక్రమ్ తో నా సినిమా ఎంత లేటైతే అంత మంచిది. తన మార్కెట్ ఇంకా పైకెళుతూ ఉంటుంది కదా. ఒకటే దెబ్బకు నన్ను లేపేస్తాడు. వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చేసుంటే ఎందుకు? ప్రతి ఏడాది తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నాడు. రెండు మూడు సంవత్సరాల తర్వాత అయితే ఇంకా బెటర్. అప్పుడు ఏ వెయ్యికోట్ల సినిమానో మనతో చేసేస్తే?(నవ్వుతూ) కనీసం మనకు ఓ పారామీటర్ ఉంటుంది.... అని సునీల్ అన్నారు.

     బంకు శీను క్యారెక్టర్ అడిగా

    బంకు శీను క్యారెక్టర్ అడిగా

    త్రివిక్రమ్‌ను ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడిని. నాకు ‘మన్మధుడు'లోని బంకు శీను క్యారెక్టర్ ఇష్టం. ఆ క్యారెక్టర్‌తో హీరోగా సినిమా చేయమని... అది చాలా కష్టం. ప్రతి సిచ్యువేషన్లో రెండు షేడ్లు రాయాలి అన్నారు. అలాగే తనకు ఛత్రపతిలో కాట్ రాజ్ క్యారెక్టర్ లాంటి విలన్ పాత్రలు చేయడం అంటే ఇష్టం. ఈ విషయం రాజమౌళి గారికి కూడా చెప్పాను అని సునీల్ తెలిపారు.

    English summary
    Tollywiood actor Sunil said, "I am Happier as Comedian". Actor Sunil who entered the industry and established his fame in Tollywood as a comedian turned into a hero. The actor has been testing his luck by doing various kind of movies. Sunil now coming back with '2 countries' movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X