శృతి హాసన్ గొడవతో నాకేం సంబంధం..డైరెక్టర్ ని అడుక్కోండి, దిశా పటాని అదిరేలా!
Recommended Video

తమిళంలో భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాలలో సంఘమిత్ర చిత్ర కూడా ఒకటి ఈ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. యుద్ధ నేపథ్యంలో సంఘమిత్ర చిత్రం రూపొందబోతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ నటించాల్సింది. కానీ చిత్ర యూనిట్ తో విభేదాలు రావడంతో శృతి హాసన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకుని షాక్ ఇచ్చింది. శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్న తరువాత చాలా మంది హీరోయిన్లని పరిశీలించి చివరకు మెరుపు తీగ దిశా పటానిని ఎంపిక చేసారు. శృతి హాసన్, చిత్ర యూనిట్ కు తలెత్తిన విభేదాల గురించి దిశాని అడగగా ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

యుద్ధ నేపథ్యంలో
సంఘమిత్ర చిత్రం యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోంది. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపిందించడానికి సిద్ధం అవుతున్నారు.

అనూహ్యంగా తప్పుకున్న శృతి హాసన్
శృతి హాసన్ ఈ చిత్రంలో నటిచాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ తో తలెత్తిన విభేదాల వలన శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇంతటి క్రేజీ మూవీ నుంచి శృతి తప్పుకోవడంతో సినీవర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరిగింది.

దిశా పటాని ఎంట్రీ
శృతి హాసన్ తప్పుకోవడంతో చిత్ర యూనిట్ పలువురు హీరోయిన్లని పరిశీలించింది. చివరకు దిశా పటానిని ఎంపిక చేయడం విశేషం. అనుకోకుండా ఈ క్రేజీ చిత్రంలో అవకాశం రావడంతో ఈ అందాల మెరుపుతీగ ఉబ్బి తబ్బిబ్బవుతోంది.

శృతిని రీప్లేస్ చేయడం గురించి
ఊహించని విధంగా దిశా పటానికి సంఘమిత్ర చిత్రంలో నటించే అవకాశం రావడంతో మీడియా ఫోకస్ ఆమెపై పడింది. శృతి హాసన్ ని రీప్లేస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అని ఆగడగా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ని రీప్లేస్ చేయటానికి నేను ఎవరిని అంటూ దిశా సమాధానం ఇచ్చింది.

చిత్ర యూనిట్‌తో గొడవ
శృతి హాసన్ నాకన్నా సీనియర్ నటి. ఆమెతో పోల్చుకుంటే నేను నటించిన చిత్రాలు చాలా తక్కువ. అలాంటప్పుడు నేను శృతి హాసన్ ని రీప్లేస్ చేయడం ఏంటి అని ప్రశ్నించింది. చిత్ర యూనిట్ కి, శృతి హాసన్ కు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కనీసం నేను అడగలేదు. మీకు తెలుసుకోవాలని ఉంటె వెళ్లి డైరెక్టర్ ని అడుక్కోండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

బాఘీతో బిజీగా
దిశా పటాని ప్రస్తుతం బాఘీ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. మార్చి 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తరువాత నుంచి దిశా పటాని సంఘమిత్ర షూట్ లో పాల్గొంటుంది.


Click it and Unblock the Notifications











