వారి ముందు వంగి ఉంటా, వీరితో అంటే ఒప్పుకునేది లేదు: మోహన్ బాబు షాకింగ్ కామెంట్

By Bojja Kumar

Recommended Video

రాజకీయ నాయకులు రాస్కెల్స్.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..!

ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ 2018లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా స్పందించారు. మీరు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారితో నటించారు కదా.... అనగానే మోహన్ బాబుకు కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్...అంటూ రిపోర్టర్ మీద కాస్త ఆగ్రహం చూపించారు.

వారే నా సినిమాల్లో నటించారు.

వారే నా సినిమాల్లో నటించారు.

రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల్లో నేను నటించడం కాదు... వారే నా సినిమాల్లో నటించారు. మీరు ఇలా మాట్లాడితే ఒప్పుకునేది లేదు అంటూ మోహన్ బాబు ఆగ్రహం చూపించారు.

వారి ముందు వంగి ఉంటా

వారి ముందు వంగి ఉంటా

నేను శివాజీ గణేశన్‌తో కలిసి పని చేశాను. ఎంజీఆర్, ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి వారుతో పని చేశాను. వారు చాలా గొప్పవారు. వారి ముందు నేను వంగి వంగి చేతులు కట్టుకుని ఉంటాను అనండి ఒప్పుకంటాను. తమిళనాడులో నన్ను శివాజీ గణేశన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు అని మోహన్ బాబు తెలిపారు.

రజనీ నాకు మంచి ఫ్రెండ్

రజనీ నాకు మంచి ఫ్రెండ్

గత 40 ఏళ్లుగా రజనీకాంత్ నాకు మంచి స్నేహితుడు. కమల్ హాసన్‌తో కూడా మంచి అనుబంధం ఉంది. మేమంతా కలిసి సినిమాల్లో నటించాము అని మోహన్ బాబు తెలిపారు.

కూతురుతో కలసి

కూతురుతో కలసి

"ఫాదర్ టు డాటర్: డిఎన్ఎ ఆఫ్ యాక్టింగ్" అనే పేరుతో జరిగిన సెషన్‌లో తన కూతురు మంచు లక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అని ఆయన అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని మోహన్ బాబు అన్నారు.

లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదు

లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదు

తన స్నేహితుడు, తనకు అన్న అయిన ఎన్టీ రామారావు చాలా మంచి వ్యక్తి అని, లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని మోహన్ బాబు అన్నారు. తనను ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించారని, ఎటువంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

95 శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్

95 శాతం మంది రాజకీయ నేతలు రాస్కెల్స్

95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్నారని అంటూ వాటిని నిలబెట్టుకునేవారెవరు అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకుని ఉంటే బారతదేశం ఇంకా మంచి స్థానంలో ఉండేదని ఆయన అన్నారు.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం

ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం

తన తండ్రి మోహన్ బాబు కింగ్లా కాకుండా కింగ్ మేకర్‌లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మి చెప్పారు. నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోహన్ బాబు స్వభావమని ఆమె అన్నారు.

భయపడకుండా తన మనసులో ఉన్న

భయపడకుండా తన మనసులో ఉన్న

తన తండ్రి కింగ్ మేకర్ అని, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించారని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి వచ్చినవారిలో చాలా మంది తన తండ్రికి తెలియదని, అయినా కూడా భయపడకుండా తన మనసులో ఉన్నది వెల్లడించడానికి సంకోచించలేదని ఆమె గుర్తు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X