నాపై అసత్య ప్రచారాలు చేయొద్దు: అజయ్
ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న నటుడు అజయ్. ఇటీవల అజయ్ గురించి ఓ న్యూస్ హల్ చల్ చేసింది. తీవ్రవాద నేపథ్యంలో సాగే ఓ చిత్రంలో హీరోగా మళ్లీ అజయ్ నటిస్తున్నాడని. ఈ విషయం ఇప్పటికే, పత్రికల్లో, ఛానెళ్లలో, వైబ్ సైట్లలో వచ్చేసింది. కానీ ఈ చిత్రం గురించి నటుడు అజయ్ కి ఎటువంటి సమాచారం అందలేదని స్వయంగా ఆయనే మీడియాకు తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ...
'ప్రస్తుతం నేను హీరోగా ఏ చిత్రం చేయట్లేదు. అసలా ఉద్ధేశ్యం కూడా లేదు. అలాంటిది నేను తీవ్రవాద నేపథ్యంలో సాగే చిత్రంలో చేస్తున్నానని వచ్చిన వార్త నన్ను విస్మయనికి గురిచేసింది. ప్రస్తుతం నేను గబ్బర్ సింగ్, రాజన్న, ఇష్క్, బెజవాడ, నందీశ్వరుడు, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం నేను హీరోగా చేస్తున్నానని చెబుతున్న చిత్రానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. హీరోగా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే నేనే ముందు మీడియాకు తెలుపుతాను. దయచేసి నాపై అసత్య ప్రచారాలు, ప్రసారాలు చేయవద్దని నా మనవి'... అని తెలిపారు.


Click it and Unblock the Notifications











