twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’లో నేను నటించడం లేదు : రాజమౌళి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి తన దర్శకత్వంలో రాబోతున్న 'బాహుబలి' చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు అంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ వార్తలకు మూల కారణంగా రాజమౌళి భారీ మీసాలతో కూడిన ఫోటో నెట్లో దర్శనం ఇవ్వడమే.

    'బాహుబలి' సినిమా రాజులు, కత్తియుద్ధాల సినిమా కావడంతో.....అందులో నటించడం కోసమే రాజమౌళి ఇలా భారీగా మీసాలు పెంచేసారంటూ అంతా అనుకున్నారు. మంచి బాడీ షేప్ కోసం డైట్ మెయింటేన్ చేస్తున్నానంటూ ఇటీవల రాజమౌళి ట్విట్టర్లో పేర్కొనడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది.

    అయితే తాజాగా రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి' సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసారు. నెట్లో చక్కర్లు కొడుతున్న ఫోటో 3 సంవత్సరాల క్రితం దిగినది అని స్పష్టం చేసారు. అప్పట్లో జస్ట్ ఫన్ కోసమే తన మీసాలను అలా పెంచినట్లు తెలిపారు.

    'బాహుబలి' అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మహాబలి' అనే టైటిల్ ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్కా మీడియా సంస్థ కూడా ఫిల్మ్ చాంబర్లో 'మహాబలి' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు.

    ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.'

    English summary
    "I am not acting in Baahubali ..:) The pic which is making rounds is 3 years old. I got my beard done in that style just for fun.." SS Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X