పథకం ప్రకారమే నాపై దాడులు : దాసరి

బొగ్గు కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందంటూ దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. దాసరి నారాయణరావుకు సంబంధాలున్న సౌభాగ్య మీడియా సంస్థతోపాటు జిందాల్‌కు చెందిన మరో నాలుగు ప్రైవేటు సంస్థలపైనా సెక్షన్ 120-బి రెడ్‌విత్ ఐపీసీ సెక్షన్ 420, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(డి) కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
సోమవారం కేసులు నమోదు చేసిన సీబీఐ మంగళవారం ఉదయం నుంచీ ఢిల్లీలోని 17చోట్ల, హైదరాబాద్‌లోని 2చోట్ల సోదాలు జరిపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న దాసరి నారాయణరావు నివాసంతోపాటు, సౌభాగ్య మీడియా సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. జార్ఖండ్‌లోని అమరకొండ ముర్గాందగల్ బొగ్గు గని కేటాయింపులో జరిగిన అవకతవకలపైనే కేసులు నమోదు చేసి సోదాలు జరిపినట్లు సీబీఐ పేర్కొంది.
బొగ్గు గనులను దక్కించుకోవడానికి ఢిల్లీలోని రెండు ఉక్కు పరిశ్రమలు వాస్తవాలను వక్రీకరించినట్లు వెల్లడించింది. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థలు దాసరి నారాయణరావు నేతృత్వంలో నడిచే సౌభాగ్య మీడియాలో రూ.2.25 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పింది. ఈ వ్యవహారంలో ఇంకా దర్యాప్తు సాగుతున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications











