చిరంజీవిని డైరక్ట్ చేయటానికి నేను కేపబుల్ కాదు
చిరంజీవిని మెగా స్టార్ స్టేచర్ కు నేను డైరక్టర్ గా న్యాయం చేయలేను. అలాగే ఆయన అభిమానుల అంచనాలను ఎప్పటికీ..ఎప్పటికీ అందుకోలేను అంటూ తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. గత కొద్దో రోజులుగా తనకు చిరంజీవిని డైరక్ట్ చేయాలని ఆసక్తి ఉందని ఇప్పటికే తన వద్ద దొర...ది లార్డ్ అనే స్క్రిప్టు ఉందని వర్మ ప్రకటిస్తూ వస్తున్నారు. అలాగే చిరంజీవిని..వెయ్యిమంది రామ్ చరణ్ లు కూడా చిరంజీవి గ్లామర్ ముందు సరితూగరని, ఆయన తన తమ్ముడు పవన్ కన్నా కూడా యంగ్ గా ఉన్నారంటూ, ఆయన స్లిమ్ అయి వచ్చిన ఫొటో చూసి ట్వీట్ చేస్తున్నానంటూ వర్మ పొగుడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఏమి మనస్సులో పెట్టుకుని వర్మ...ఇలా చిరంజీవి గురించి ట్విట్టర్ లో రాస్తున్నారనేది ఎవరికీ అంతు పట్టని విషయమై కూర్చుంది.
రామ్ గోపాల్ వర్మ చిరంజీవి దొర రక్త చరిత్ర ట్విట్టర్ ద లార్డ్ ram gopal varma chiranjeevi dhora rakta charitra twitter the lord


Click it and Unblock the Notifications