ఆయనతో హద్దుమీరి చేయలేదంటూ బుకాయిస్తోంది...
'గాయం2"లో గరం గరంగా కనిపించి యువత మతి పోగొట్టారు విమల రామన్. ఆ సినిమాలోని కొన్నివేశాల్లో..శృంగార రసం హద్దులు దాటిందని పలువురి అభిప్రాయం. అయితే అందులో నేను జగపతి బాబు బార్యగా నటించాను. భార్యా భర్తలు ఆ మాత్రం క్లోజ్ గా ఉండటం సర్వసాధారణం. సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టే అంత క్లోజ్ గా నటించాను. అవసరం లేకపోయినా హద్దుమీరి నటించలేదే..?సముద్రపు ఒడ్డున హద్దుమీరిన శృంగారాన్ని ఒలకబోస్తూ చిత్రీకరించిన పాటలు ఈ మధ్య చాలా సినిమాల్లో చూశాను. వాటికంటే..అసభ్యంగా నేనేం నటించలేదు". అని చిరుకోపంతో చెప్పారు విమల రామన్. శ్రీకాంత్ సరసన విమల రామన్ నటించిన 'రంగ ది దొంగ" త్వరలో విడుదల కానుంది.
ప్రస్తుతం విమల రామన్, సుమంత్ కథానాయకుడిగా రూపొందుతున్న కుమార్ బ్రదర్స్ వారి సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రియమణి తొలి నాయికగా ఉన్నారు. ఈ సినిమాలో విమల రామన్ బికినీలో నటించనున్నట్టు తెలిసింది. విమల రామన్, ప్రియమణి అందాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పొచ్చు...


Click it and Unblock the Notifications











