twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ తో డేటింగా, అంతలేదంటోంది

    By Srikanya
    |

    ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందంటూ, ఇద్దరూ కలిపి తిరుగతున్నారంటూ వస్తున్న వార్తలను కాజల్ కొట్టిపారేసింది. నేను ప్రభాస్ ని డేటింగ్ చేయటమేంటి.. ఇద్దరం కలిపి చేసిన సినిమాల్లో మా మధ్య మంచి కెమిస్ట్ర్రీ వర్కవుట్ అయ్యింది అంతే అని తేల్చేసింది. కాజల్, ప్రబాస్ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇధ్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయంటే ఆమె నవ్వి కొట్టి పారేసింది. ఇక ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల పైనే ఉందని తేల్చేసింది. అంతేగాక ప్రతీసారి నేను నటించే హీరోతో నాకు లింక్ లు పెట్టి ప్రచారం చేయటం మామూలైపోయింది. అదృష్టవశాత్తూ అజయ్ దేవగన్ తో నాకు ఎఫైర్ అంటగట్టలేదు అంది.ఇక హింది నుంచి తనకు కంటిన్యూ ఆఫర్స్ వస్తున్నాయని, అయితే వాటిల్లో తాను ఏరి ఎంపికచేసుకుందామనే నిర్ణయంతో ఉన్నానని, స్క్రిప్టులు ప్రస్తుతం వింటున్నానని చెప్పింది. సింగం సినిమా తనకు మంచి గుర్తింపుని, ప్రశంసలను తెచ్చి పెట్టిందని అంది. అలాగే మహేష్ బాబుతో తాను చేస్తున్న ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని, సూర్యతో తమిళంలో ఓ చిత్రం చేస్తున్నానని అంది.

    English summary
    “I never dated Prabhas. We share a great chemistry and rapport as we have done several films together...Kajal Agarwal
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X