రానా-త్రిష బ్రేకప్: తాను కాదంటూ మరో హీరోయిన్

By Bojja Kumar

హైదరాబాద్ : దగ్గుబాటి యువ హీరో రానాపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌతిండియా పాపులర్ హీరోయిన్ త్రిషతో రానా డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని ఆ రూమర్స్ సారాంశం. అయితే చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఇద్దరూ యాక్టర్లు ఖండించారు. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే, మా మధ్య అంతకు మించి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. వారు ఎన్ని సార్లు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పినా వారిపై రూమర్స్ మాత్రం ఆగలేదు.

ఇటీవల వీరిపై ఓ సరికొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరూ విడిపోయారని ఆ వార్తల సారాంశం. రానా ఇతర హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నాడనే నెపంతో అతనికి త్రిష బ్రేకప్ చెప్పేసిందట. వారి ట్వీట్స్ కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ‘ఓ కథకు ఎప్పుడూ మూడు కారణాలుంటాయి. నీ వైపు, ఎదుటి వారి తరుపున వాదనలుంటాయి. నిజమనేది ఈ రెండిటిక భిన్నంగా ఉంటుంది' అంటూ రానా ఇటీవల ట్వీట్ చేసాడు. ‘ఒక వ్యక్తిని మరిచి పోవడం చాలా సులభం. మళ్లీ అతన్ని నమ్మడం అంటూ ఉండదు' అని త్రిష ట్వీట్ చేసింది. ఒకరి పేర్లు ఒకరు పేర్లు ప్రస్తావించక పోయినా... ఒకరినుద్దేశించి ఒకరు చేసుకున్న వ్యాఖ్యలే అని, ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 I Am Not Dating Rana Daggubati: Ragini Dwivedi

కాగా...రానా-త్రిష బ్రేకప్ కావడానికి ముఖ్యకారణం కన్నడ నటి రాగిణి ద్వివేది అనే రూమర్లు వచ్చాయి. రాగిణితో రానా డేటింగ్ మొదలు పెట్టడం త్రిషకు నచ్చలేదని, అందుకే వీరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయారనే గాసిప్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో రాగిణి ద్వివేది స్పందించారు.

‘రానా-త్రిష మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అది వారి పర్సనల్ మ్యాటర్. నాకు ఎలాంటి సంబంధం లేదు. రానా నాకు మంచి డియరెస్ట్ ఫ్రెండ్. కానీ అతనితో డేటింగ్(ప్రేమాయణం) చేయడం లేదు. త్రిష ఎంతో మంచి వ్యక్తి ఇలాంటి వార్తలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి' అని రాగిణి ద్వివేది చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X