రానాతో డేటింగా...చిన్న పిల్లాడు, తేల్చేసిన శ్రియ
రానా చదువుకొంటున్నప్పటి నుంచీ నాకు తెలుసు. వాళ్ల ఫ్యామిలీతో నాకు ఎనిమిదేళ్ల నుంచీ అనుబంధం ఉంది. వాళ్లంటే నాకు చాలా ఇష్టం. నాకెంతో గౌరవం ఇస్తారు. అలాంటి రానా తో నేను డేటింగ్ చేస్తానా...వినటానికే విచిత్రంగా ఉంది. మా ఇద్దరి మధ్యా ప్రెండ్షిప్ తప్ప మరేమీ లేదు... డేటింగ్ లాంటివన్నీ వట్టి అబద్ధాలే అంటూ తేల్చేసింది శ్రియ. రానా, శ్రియల మధ్య డేటింగ్ నడుస్తోందని కొద్ది కాలంగా అంతటా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం మీద శ్రియ తన మనసులో మాటను ఇలా బయటపెట్టింది. అలాగే తాను ప్రస్తుతం దృష్టి దీపా మెహతా తెరకెక్కిస్తున్న 'మిడ్‌నైట్ చిల్డ్రన్' సినిమా మీదే పెట్టానని చెప్తోంది.
ఆ సినిమా గురించి చెబుతూ.. సల్మాన్ రష్దీ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమది. రష్దీ గొప్ప రచయిత. ఆయన రచనలన్నీ ఎంతో ఆర్ధ్రంగా ఉంటాయి. ఇప్పటికే 'మిడ్‌నైట్ చిల్డ్రన్' చాలాసార్లు చదివాను. ఆ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని అంది. ప్రస్తుతం శ్రియ ...మంచు మనోజ్ ప్రక్కన మరో చిత్రం కమిటైంది.


Click it and Unblock the Notifications











