నటిస్తున్నాడంటూ వార్తలు: దిల్ రాజు స్పందన ఇలా..
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన దిల్ రాజు....ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు నటుడిగా మారుతున్నాడని, 'గీతాంజలి' చిత్రంలో దిల్ రాజు అతిథి పాత్ర పోషించాడని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వార్తలను దిల్ రాజు ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. గీతాంజలి సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేయలేదని దిల్ రాజు స్పష్టం చేసారు. గీంతాజలి చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

అంజలి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ అండ్ కామోడీ చిత్రం 'గీతాంజలి'. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు.
శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.


Click it and Unblock the Notifications











