'మగధీర'తో సంభందం లేదని ప్రకటించిన యంగ్ హీరో
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన 'మగధీర' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై రణ్‌బీర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ...నేను 'మగధీర' రీమేక్‌లో నటించడం లేదు.ఆ చిత్రానికి నాకూ సంభందం లేదు. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'రాక్‌స్టార్' సినిమాలో నటిస్తున్నాను.
దీని తరవాత అనురాగ్ బసు రూపొందించబోయే 'బర్ఫీ' సినిమాలో నటించాల్సి ఉంది. ప్రస్తుతానికి మరో సినిమా ఏదీ అంగీకరించలేదు అన్నారు.ఇక రాజమౌళి కూడా తాను హిందీ మగధీరను డైరక్ట్ చేయబోవటం లేదని, అవన్నీ రూమర్సే అంటూ కొద్ది రోజుల క్రిందట ట్విట్టర్ లో క్లారిఫై చేసారు. అలాగే గజనీ నిర్మాత మధు మంతెన ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకుకెళ్థున్నారు. మెఘల్ సామ్రాజ్యంలో జరిగే కథగా ఈ ప్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఆయన కూడా త్వరలోనే తనకేమీ సంభందం లేదని ప్రకటన ఇచ్చినా అశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











