శంకర్‌తో ఆ చిత్రం చేయడం లేదు: దీపిక
ముంబై: రోబో ఫేం శంకర్ దర్శకత్వంలో తాను ఏ చిత్రం చేయడం లేదని బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే స్పష్టం చేసింది. శంకర్ తాజాగా రూపొందిస్తున్న 'ఐ' చిత్రంలో దీపికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు, విక్రమ్ సరసన ఆమె నటిస్తోందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. దీనిపై ఆమె తాజాగా మీడియాతో స్పందిస్తూ అవన్నీ రూమర్లే అని తేల్చి చెప్పింది.
ఇటీవల దీపిక నటించిన 'కాక్‌టెయిల్' సినిమాలో ఆమె జీరో సైజులో అందంగా కనిపించిందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీనిపై దీపిక స్పందిస్తూ.....సినిమాలోని పాత్ర కోసమే తాను జీరో సైజ్‌కి మారాను. కానీ జీరో సైజులో ఏమంత అందంగా ఉండరనేది నా ఉద్దేశ్యం అంటోంది. అందంగా కనిపించాలంటే ఫిట్‌గా, హెల్తీగా ఉండాలనేదే నా కాన్సెప్ట్ అని చెప్పింది. జీరో సైజ్ ప్రయత్నించాలి కానీ హెల్తీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తోంది.
ప్రముఖ దర్శకుడు శంకర్, చియాన్ విక్రమ్ కాంబినేషన్లో త్వరలో రాబోతున్న చిత్రం 'ఐ'. ఈ చిత్రంలో విక్రమ్ సరసన తొలుత సమంతను అనుకున్నప్పటికీ చివరకు అమీ జాక్సన్ హీరోయిన్ ఖరారైంది. రూ. 75 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











