‘గబ్బర్ సింగ్’తో చేయడంలేదన్న సెక్స్ బాంబ్!
రామ్ గోపాల్ వర్మ 'డిపార్ట్ మెంట్' చిత్రంలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఊరిస్తున్న బ్రెజిలియన్ హాట్ బ్యూటీ నథాలియా కౌర్...'గబ్బర్ సింగ్'తో కలిసి టైటిల్ సాంగులో గంతులేయనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆమె అందాల ప్రదర్శన కోసం అభిమానులంతా ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్నారు.
అయితే 'గబ్బర్ సింగ్' అభిమానులందరినీ నిరాశ పరుస్తూ తాజాగా ఓ ప్రకటన చేసింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో తాను చేయడం లేదని నథాలియా కౌర్ స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించింది. దీంతో ఆశగా ఎదురు చూస్తున్న వారంతా నిరాశలో పడి పోయారు. కాగా...నథాలియా డిపార్ట్ మెంట్ చిత్రంలో చేసిన 'డన్ డన్' ఐటం సాంగుకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఆ పాటలో బికీనీని తలపించే డ్రెస్ వేసి వేసి బీభత్సంగా అందాలు ఆరబోసిన వైనాన్ని శృంగార ప్రియులు తెగ ఆస్వాదిస్తున్నారు.
అయితే గబ్బర్ సింగ్ 'కెవ్వు కేక' ఐటం సాంగులో మలైకా అరోరా మాత్రం అభిమానులకు కనువిందు చేయడం ఖాయం అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో ఆమె హాట్ పెర్ఫార్మెన్స్ నిజంగానే కేక పెట్టిస్తుందట. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











