ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు బ్రహ్మానందం కౌంటర్...
బ్రహ్మానందంపై వేటు వేయటానికి ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బ్రహ్మానందం సెట్స్ పై ఇబ్బంది పెట్టే విధానం అంతటా టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతల మండలిలో ఈ డిస్కషన్ జరిగిందని విన్న బ్రహ్మానందం మండిపడుతున్నారు. తన రేటు తగ్గించేందుకు సుతారాము ఇష్టపడటం లేదు. ఇదే విషయాన్ని ప్రస్దావిస్తూ.తనలాంటి స్టార్ ని బర్డెన్ గా భావిస్తే ఏ గుండు హనుమంతురావో, గుండు సుదర్శనం దగ్గరకో వెళ్ళాలి. నేనేమీ..నన్నేతీసుకోండంటూ ఎవరినీ ఫోర్స్ చేయటం లేదే అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా రీసెంట్ గా ఆయన నటిస్తున్న షూటింగ్ సెట్ పై జరిగింది. ఇది విన్న అక్కడ వారెవ్వరూ మాట్లాడలేకపోయారు.
ఇక తెరపై నవ్వించే బ్రహ్మానందం తన అన్ ప్రొపిషనల్ ఏటిట్యూడ్ తో నిర్మాతలను బాగా ఏడిపిస్తూంటారు. ఓహ్రి రెస్టారెంట్ నుంచి రోజూ తన కుటుంబం మొత్తానికి ఫుడ్ పార్శిల్ తెప్పించుకుని ఆ బిల్లను నిర్మాతకు ఇస్తూంటారు. అలాగే కంపెనీ వెహికల్ లో వచ్చి వెహికల్ కన్వీయన్స్ ని నిర్మాతకు పంపి డబ్బు వసూలు చేస్తూంటారు. మూడు కిలోమీటర్ల దూరానికి కూడా రెండు వేల ఐదు వందలు బిల్ వేస్తారు. రకరకాలుగా డబ్బుని పిండి వసూలు చేస్తూంటారు. దర్శకుడు కొత్త వాడు అయితే అతని మాట అస్సలు వినకుండా కామెంట్స్ చేస్తూంటారు. తోటి ఆర్టిస్టులను రకరకాలుగా ఇబ్బంది పెడుతూంటారు. అయితే బ్రహ్మానందంకు స్టార్ వ్యాల్యూ ఉండటంతో నిర్మాతలు అతన్ని తప్పని సరిగా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు వేటు వేయాలనగానే ఆయన రివర్స్ లో ఇలా మాట్లాడుతున్నారు.


Click it and Unblock the Notifications











