నేను గే కాదు.... కానీ పవన్ కళ్యాణ్‌నే నా ఆప్షన్: వర్మ సంచలనం
Recommended Video

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో తన కామెంట్లతో రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వారిలో తానే పెద్ద అభిమానిని అని చెప్పుకునే వర్మ మరోసారి తనదైన కామెంట్లు చేశాడు. 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల చేపథ్యంలో ఆయన ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశాడు.

రజనీ, అమితాబ్ దిగదుడుపే
నేను గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మగాడిని చూడలేదు. పవన్ కళ్యాణ్ ముందు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎందుకూ పనికిరారు... అంటూ వర్మ వ్యాఖ్యానించారు.

బ్రూస్‌లీకి మొగుడులా ఉన్నాడు, నేను గే కాదు
పవన్ కళ్యాణ్ చూస్తే బ్రూస్ లీకి మొగుడులా ఉన్నాడు. నేను గే కాదని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒక వైపున ఉన్నా... నేను ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయినే ఎంచుకుంటాను... అని వర్మ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లుక్ మీద కామెంట్ చేశారు.

పవన్ ముందు పుట్టాడు
పవన్ కళ్యాణ్ ముందు పుట్టాడా? ఎమోషన్స్ తర్వాత పుట్టిందా? చెట్టు ముందా విత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా? అనే అనాది ప్రశ్నకి నా సమాధానం పవన్ కళ్యాణ్ ముందు పుట్టి మనందరికీ ఇప్పుడు ఎమోషన్స్ నేర్పిస్తున్నాడు అని నేను అంటాను. హాట్సాఫ్ పికె.... అంటూ వర్మ కామెంట్ చేశాడు.

పవన్‌ను ముద్దాడుతున్న ఫోటో
తాను పవన్ కళ్యాణ్‌ను ముద్దాడుతున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసిన వర్మ దాన్ని పోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











