నేను మంచోణ్ణి కాను: రామ్ గోపాల్ వర్మ
నేను మంచోణ్ణి కాను..సమాజమ్మీద నాకు బాధ్యత లేదు..నేను ఓ దర్శకుడిని..నిర్మాతనీ..అంతే. తానేంటో ఒక్క ముక్కలో చెప్పేశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తానేమీ మెసేజ్ లు చెప్పడానికి సినిమాలు తీయననీ, అలాంటి సినిమాలు తీయడం తనకు చేతకాదనీ చెబుతోన్న వర్మ, హిట్ సినిమాలూ, ప్టాప్ సినిమాలూ స్ర్కిప్ట్ దశలో తేలవని అంటున్నాడు.
'ఏ ఏదవా ప్లాప్ సినిమాని తీయాలనుకోడు, అనీ మంచి సినిమాలనే తీస్తాం. అవి చెత్త సినిమాలా మంచి సినిమాలా అనేది జనం డిసైడ్ చెయ్యాలి" అంటూ ఇంటర్య్వూల్లో నిర్మొహమాటంగా చెప్తున్నాడు వర్మ. తన తదుపరి చిత్రం 'రణ్" ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొస్తోన్న వర్మ, తానెప్పుడూ సంచలనాలకోసం ప్రయత్నించననీ, మీడియానే సంచలనాలకోసం తనవద్దకు వస్తుంటుందని మీడియాకి చురకలేశాడు. ఇప్పటి దాకా హీరోయిన్ల బట్టలూడదీసి చూపించిన వర్మ, ఇప్పుడు మీడియా బట్టలూడదీస్తున్నాడా? అనడిగితే, 'వంకర కోణంలో ప్రశ్నలు అడగడంలోనే తెలుస్తోంది మీడియ ఇప్పుడు ఏ పొజిషన్ లో వుందో" అంటూ మరో షాక్ ఇచ్చాడు వర్మ.


Click it and Unblock the Notifications











