twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పులి' చిత్రంతో నాశనమయ్యింది కేవలం నేనే..నిఖిషా పటేల్

    By Srikanya
    |

    పులి ప్లాపుతో నేనే నాశనమయ్యాను..పవన్ బాగానే ఉన్నారు..ఆయన ఇంకో సినిమాలో అప్పుడే బిజీ అయ్యారు. ఎస్.జె.సూర్య..దర్శకుడుగా కంటిన్యూ అవుతున్నారు. ఎటొచ్చీ నా రెండున్నరేళ్ళ కెరీర్ పాడయింది. ఈ సినిమా సంతకం పెట్టేడప్పుడు నేను 19 సంవత్సరాల అమ్మాయిని..నా విలువైన వయస్సు వృధా అయినట్లే..అంటూ మండిపడుతోంది నిఖిషా పటేల్. తాజాగా ఆంద్రాలోని ఓ లీడింగ్ ఇగ్లీస్ పేపరుకిచ్చిన ఇంటర్వూలో ఆమె ఇలా స్పందించింది. అలగే ఆ స్క్రిప్టు చదవేటప్పుడు ఇది షూర్ గా హిట్ అవుతుందనిపించింది. అందులోనూ ఎ.ఆర్.రహమాన్ సంగీతం, వంటి ఎన్నో పెద్ద సాంకేతిక నిపుణులు పనిచేయటం ధైర్యానిచ్చింది. అయితే సినిమా పూర్తయ్యాక చూస్తే చాలా నిరుత్సాహపరించింది. ఇక ఈ చిత్రం రిలీజయితే చాలా ఆఫర్స్ వస్తాయనుకున్నాను. షూటింగ్ లో ఉండగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ నన్ను తమ కొత్త చిత్రాల కోసం సైన్ చేయమని అడిగారు.అయితే రిలీజయ్యే వరకూ వేరే చిత్రం ఒప్పుకోవద్దని ఈ పులి చిత్రం వారు చెప్పారు. ఇప్పుడు సినిమా చూస్తే ఇలా దారుణంగా ఫెయిలైంది.

    అలాగే పులి ప్లాపు అవటానికి కారణంగా ఆమె ఖుషి చిత్రం అని పేర్కొంది. ఎస్.జె.సూర్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి చిత్రం చాలా కామిడీగా ఉంటుంది. దాంతో ఫ్యాన్స్ అలాంటిదేదో ఈ చిత్రం నుంచి ఎక్సపెక్ట్ చేసారు. కానీ వారు ఊహించినది ఈ చిత్రంలో లభించినట్లు లేదు. అలగే తన ప్యూచర్ ప్లాన్ చెబుతూ..ముంబైలో దర్శకులకు ఈ చిత్రం ప్రత్యేక స్క్రీనింగ్ వేసి ఆహ్వానించి చూపెడదామనుకుంటున్నాను. అలాగే తను ఈ పరిశ్రమలో ప్రవేశించేటప్పుడు...ఇంతలా హీరోల డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అని తెలియదని చెప్పింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో నాకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్లు అర్ధమై డైరక్టర్ ని అడిగాను. అయితే దానికి దర్శకుడు..ఇక్కడి తెలుగువారికి అలా ఓవర్ యాక్టింగ్ గా, బబ్లీగా ఉండటం ఇష్టమని చెప్పి ఒప్పించారు అంటూ నిఖిషా పటేల్ కుండ బ్రద్దలు కొట్టినట్లు పులి గురించి చెప్పుకొచ్చింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X