వరుణ్ సందేశ్ తో ఎఫైర్ లేదని ఖండన
వరుణ్ సందేశ్ తో నాకు ఏ ఎఫైర్ లేదు. మేమిద్దరం ఆ రోజుకు పార్టికి క్యాజువల్ గా వెళ్ళాం. అతను నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అంటూ మీడియాకి చెప్పుకొచ్చింది అస్మితా సూద్. బమ్మిగాడి కథ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించిన ఈ ముంబై భామకి వరుణ్ సందేశ్ కి మధ్య ఎఫైర్ నడుస్తోందని మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండిస్తూ ఇలా స్పందించింది. అలాగే వీరిద్దరూ అల్లు అర్జున్ బ్యాచ్ లర్ పార్టీకి వచ్చి బాగా ఇంటిమసి ఉండటం అప్పట్లో అందరి దృష్టిలో పడింది. ఆ విషయం కూడా ప్రస్దావిస్తూ కేవలం పార్టిలో కలిసామంటూ చెప్పుకొచ్చింది.
మోడల్ గా ఉన్నంతకాలం తనపై ఏ విధమైన మచ్చలేదని, సినిమాల్లోకి రాగానే ఇలా లింక్ లు అంటగట్టడం బాగోలేదని నొక్కి మరి చెప్తోంది. ఇక వరుణ్ సందేశ్..డ్రగ్స్ తీసుకుంటున్నాడంటూ వచ్చిన మ్యాటర్ పై మీ కామెంట్ అంటే ఆమె..నాకు అతని పర్శనల్ లైఫ్ గురించి పెద్దగా తెలియదు. అతను చాలా సెన్సిబుల్..బాగా చదువుకున్నవాడు. అలాంటివాడు డ్రగ్స్ తీసుకుంటాడంటే నమ్మలేను అని తేల్చి చెప్పింది. ఇంతకీ ఇప్పటికీ మీరు కలిసే ఉన్నారా అంటే..లేదు సినిమా అయిపోయాక నాతో టచ్ లో లేదని శెలవిచ్చింది.


Click it and Unblock the Notifications











