‘అమెరికా అల్లుడు’ పేరుతో హీరో శ్రీకాంత్ కి టోపీ
శ్రీకాంత్ హీరోగా త్వరలో 'అమెరికా అల్లుడు" అనే చిత్రం విడుదల కాబోతోందంటూ ఓ ప్రకటన, న్యూస్ అన్ని వార్తా పత్రికల్లోనూ వచ్చింది. అయితే తాను అమిరికా అల్లుడు పేరుతో ఏ చిత్రమూ చేయలేదని, తెలుగులో నాగార్జున హీరోగా చేసిన సంతోషం చిత్రం కన్నడ రీమేక్ ఉగాదిలో తాను ప్రభుదేవా పాత్ర చేసానని, దాన్ని ఇప్పుడు 'అమెరికా అల్లుడు" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారని, అలాగే ఆ చిత్రంలో తాను హీరోని కాదని గెస్ట్ రోల్ తనదని స్పష్టం చేస్తూ మీడియా దగ్గర వాపోయాడు.
అలాగే ఆ చిత్రంలో కన్నడ హీరో రవిచంద్రన్ ఉన్నాడనే, అతను స్నేహితుడని సినిమా చేసాను అంటున్నారు. ఇక రవి చంద్రన్, శ్రీకాంత్, కామ్న జఠ్మలానీ, జెన్నిఫర్ కొత్వాల్ కాంబినేషన్ లో కన్నడ దర్శకుడు ఓంసాయిప్రకాష్ నిర్దేశకత్వంలో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై కె.వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అలాగే ఈ చిత్రం గురించి డబ్బింగ్ నిర్మాత మీడియా మీటింగ్ పెట్టి...'అమెరికా అల్లుడు" చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ-అన్నిరకాల పక్కా కమర్షియల్ అంశాలతో వస్తున్న లలీ ఎంటర్ టైనర్ ఇది. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం. ఆర్.పి.పట్నాయక్ మంచి సంగీతాన్ని అందించారు. చిత్రంలోని ఐదు పాటలను అమెరికా, స్విట్జర్లాండ్, ఊటీ వంటి పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి, జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











