అలా చేయడానికి నేనేమీ లేబర్ కాదు: హీరోయిన్
హైదరాబాద్: 'చిన్నారి పెళ్లి కూతురు' టీవీ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన నటి అవికా గోర్.....'ఉయ్యాలా జంపాలా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'లక్ష్మీ రావే మా ఇంటికి' అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తోంది.
సినిమా పరిశ్రమలో సినిమా తారలపై పుకార్లు షికార్లు చేయడం మామూలే. ఇక పాపులర్ అవుతున్న సినిమా స్టార్లపై పుకార్ల జోరు కాస్త ఎక్కువగానే ఉంటుంది. తాజాగా హీరోయిన్ అవికా గోర్‌పై కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్ల విషయం ఆమె చెవిన పడటంతో వెంటనే ఖండించింది.

కొన్ని అనుభవాల కారణంగా అవికా గోర్ డబ్బుల విషయంలో తెలుగు నిర్మాతలను అస్సలు నమ్మడం లేదని, తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని డైలీ వైజ్ లెక్కవేసి ఏ రోజు అమౌంట్ ఆరోజే తీసుకుంటుందని అంటున్నారు. గతంలో కొందరు నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టడం వల్లనే ఆమె ఇలా చేస్తుందని అంటున్నారు.
అయితే ఈ వార్తలను అవికా గోర్ ఖండించారు. రోజుల లెక్కన డబ్బు తీసుకోవడానికి నేనేమీ లేబర్ కాదు. అగ్రిమెంటు ప్రకారమే రెమ్యూనరేషన్ తీసుకుంటాను. కావాలంటే నిర్మాతలను అడిగి తెలుసుకోండి అని చెబుతోంది. ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదని అంటోంది.


Click it and Unblock the Notifications











