twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హన్సిక ఇంకా కాలేదు

    By Staff
    |

    నేనింకా చిన్న పిల్లనే.....మైనర్ నే అంటోంది హన్సిక. ఆమే స్వయంగా ఈ విషయాన్ని మీడియాకి చెప్పుతోంది. "నేనింకా మైనర్‌నే. ఏ విషయానికి ఎంత ఖర్చు చేయాలో నాకు పూర్తిగా తెలియదు కదా. అయినా అమ్మని మించిన శ్రేయోభిలాషి నాకెవరున్నారు? అందుకే నా వ్యవహారాలనన్నింటినీ అమ్మే చూసుకుంటుంది. ఆర్థిక వ్యవహారాలతో సహా అన్నీ. ఎప్పుడైనా ఖర్చు చేయాల్సి వస్తే అమ్మ పర్సులో నుంచే ఖర్చుపెడతాను. మరి..నేను దాచుకున్న సొమ్మును ఏం చేస్తాననే కదా..మీ సందేహం? అమ్మ పుట్టినరోజు, దీపావళి, న్యూఇయర్‌ సందర్భాల్లో షాపింగ్‌కి ఉపయోగపడతాయి. అప్పుడు నాకు నచ్చిన వారికి బహుమతులు కొనిస్తుంటాను. ఇతరులకు మంచి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరచడమంటే నాకు చాలా సరదా" అని చెప్పుకొచ్చింది హన్సిక. సర్లే ఇప్పుడీ మేటర్ ఎందుకమ్మా నిన్ను ఎవరన్నా పెద్ద అమ్మాయిగా చూసి ఇబ్బంది పెడుతున్నారా అంటే అలాంటివేమి లేదు అంది. మరి ఎందుకు ఈ మైనర్ పబ్లిసిటీ అంటే మూతి తిప్పుకుంది.

    హాట్ హన్సిక తాను సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగానంటూ తన కుటుంబ వివరాల చెప్పుకొచ్చింది. మమ్మీ, సోదరుడు ప్రశాంత్ అంతే నా కుటుంబం అంది సింపుల్ గా. అంటే మీ నాన్నగారు అని అడిగితే మమ్మీ పెంపకంలోనే పెరిగాను. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ నాది. అని చెప్పుకొచ్చింది. ఇక తన సినీ ప్రవేశ ఎంట్రీ గురించి ఈ మధ్య చెప్పుకొచ్చింది. ఆ ఎంట్రీ కాకతాళీయంగా జరిగిపోయిందంటోంది. మమ్మీ డాక్టర్ మోనా..స్కిన్ అంటే హెయిర్ స్పెషలిస్ట్. ఫిల్మ్ స్టార్స్ కూడా మమ్మీ దగ్గరకి వైధ్య సలహాల కోసం తరుచూ వచ్చేవారు. బాలీవుడ్ స్టార్ అరుణ్ ఇరానీ కూడా మమ్మీ క్లయింట్. ఫ్యామిలీ ప్రెండ్ కూడా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆమె ప్రధాన కారణం.నన్ను సినిమా రంగంలోకి తీసుకురావల్సిందిగా మమ్మీకి చెప్తూండేది. అలాగే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని వ్యక్తిగత శ్రధ్ధ తీసుకునేది. నా పదేళ్ళ వయిస్సులో బాలనటిగా ఎస్కేప్ ఫ్రం టాలిబన్ చిత్రంలో నటించాను. ఆ చిత్రం 2003 ఫిబ్రవరి 13 న రిలీజైంది అంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X